Venus transit Effect: జీవితంలో భౌతికమైన సుఖదుఖాలు, రోమాన్స్ ఇచ్చే గ్రహం శుక్రుడు జూన్ 18 నుంచి రాశి మారనున్నాడు. తన ప్రియ రాశి వృషభంలో ప్రవేశించనున్నాడు.  ఈ సందర్భంగా ఆ మూడు రాశులవారికి డబ్బే డబ్బు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యశాస్త్రంలో ప్రతి గ్రహం రాశి మారడం జరుగుతుంటుంది. ఎప్పుడు రాశి మారినా..అన్ని రాశులపై ఆ ప్రభావం కన్పిస్తుంది. శుక్ర గ్రహం గోచారం అత్యంత మహత్యం కలిగింది. శుక్ర గోచారం ఆర్ధిక పరిస్థితి, సుఖం, ప్రేమ జీవితంపై ప్రభావం పడుతుంది. జూన్ నెల 18వ తేదీన శుక్రుడు తన ప్రియ రాశి వృషభంలో ప్రవేశించనున్నాడు. శుక్రుడు వృషభరాశిలో ప్రవేశించడం కొంతమందికి చాలా శుభ సూచకంగా మారుతుంది. ఆ ప్రయోజనాలు, అదృష్టం ఏంటో చూద్దాం..


మేషరాశివారికి చాలా శుభ సూచకం. వారికి సంపద విషయంలో చాలా లాభం కలుగుతుంది. వ్యాపారం చేసేవారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. భారీగా డబ్బులు సంపాదిస్తారు. నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగొస్తాయి. పార్టనర్‌షిప్ వ్యాపారం చేసేవారికి కూడా లాభాలు కలుగుతాయి. ఉద్యోగవర్గాలకు మంచి అనువైన సమయం. ప్రేమ జీవితం బాగుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే అన్ని విధాలా అనుకూలం.


కర్కాటకరాశివారికి చాలా లాభం కలుగుతుంది. వీరి ఆదాయం పెరుగుతుంది. అనుకోనివిధంగా డబ్బు అందుతుంది. కొత్త మార్గాల్లో డబ్బులు సంపాదిస్తారు. ఏదైనా కాంట్రాక్ట్ లేదా డీల్ చేస్తారు. ఇది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. యాత్రలు చేసే అవకాశాలున్నాయి. ఒకవేళ పార్టనర్‌షిప్‌లో పనిచేస్తుంటే..మంచి సమయమే. జీవిత భాగస్వామి నుంచి అంతా బాగుంటుంది. 


సింహరాశివారికి..శుక్రుడు వృషభంలో ప్రవేశించే ఫలితం ఎక్కువగా ఉంటుంది. భారీగా లాభాలు కలుగుతాయి. కొత్త ఉద్యోగం లభించవచ్చు. పదోన్నతి, ఇంక్రిమెంట్ లభిస్తాయి. ఒకవేళ ముందే ఉద్యోగం మారాలనే ఆలోచనలో ఉంటే వెంటనే కార్యరూపం దాల్చవచ్చు. బదిలీ జరిగినా ప్రయోజనముంటుంది. మంచి పనులు చేస్తే ప్రశంసలు లభిస్తాయి. ధనలాభముంటుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవితంలో సుఖసంతోషాలు పెరుగుతాయి. వ్యాపారులకు అనువైన సమయం. 



 


Also read: Total Number Effect: ఈ తేదీల్లో పుట్టినవారు..పుట్టుకతోనే నాయకులు, అందానికి ఆకర్షితులవుతారు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook