Shukra Gochar 2022: నెలలో 2 సార్లు స్థానాన్ని మార్చనున్న శుక్రుడు... ఏ రాశి వారికి లాభం, ఏ రాశివారికి నష్టమో తెలుసుకోండి..
Shukra Gochar 2022: వచ్చే నెలలో శుక్రుడు తన రాశిని రెండు సార్లు మార్చనున్నాడు. దీని సంచారం కొన్ని రాశులకు శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది.
Grah Rashi Parivartan 2022: ఈ సంవత్సరం చివరి నెలలో కొన్ని గ్రహాలు తమ స్థానాలను మార్చనున్నాయి. డిసెంబరులో శుక్రుడు తన స్థానాన్ని రెండు సార్లు మార్చనున్నాడు. ఆస్ట్రాలజీ ప్రకారం, శుక్రుడు డిసెంబరు 3వ తేదీన ధనస్సు రాశిలోకి, డిసెంబరు 29న మకరరాశిలోనూ (Shukra Gochar December 2022) సంచరించనున్నాడు. ప్రేమ, రొమాన్స్ మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడు శుక్రుడు. డిసెంబరులో శుక్రుడి రాశి మార్పు కొందరికి అనుకూలంగానూ, మరికొందరికి ప్రతికూలంగానూ ఉండనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
శుక్ర సంచారం ఈ రాశులకు శుభప్రదం
వృషభం (Taurus): ఈ రాశి యెుక్క లగ్నానికి, ఆరో ఇంటికి అధిపతి శుక్రుడు. ధనస్సు మరియు మకరరాశుల్లో శుక్రుడి సంచారం వల్ల వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు డబ్బును ఆదా చేస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. బిజినెస్ లో మంచి లాభాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి.
కన్య (Virgo): ఈ రాశి వారికి శుక్రుడు రెండవ మరియు తొమ్మిదవ ఇంటికి అధిపతి. ఇంట్లో సంతోషం నెలకొంటుంది. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. కెరీర్ లో పురోగతి లభిస్తుంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ఈ సమయం కలిసి వస్తుంది.
శుక్రు సంచారం ఈ రాశులకు నష్టం
మిధునరాశి (Gemini): మిథున రాశి యెుక్క శుక్రుడు ఐదవ మరియు పన్నెండవ గృహాలకు అధిపతి. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. బిజినెస్ విస్తరిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. కానీ డబ్బు ఆదా చేయలేరు. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు కొంచెం మిశ్రమంగా ఉంటుంది.
కర్కాటకం (Cancer): ఈ రాశి యెుక్క నాల్గవ మరియు పదకొండవ ఇంటికి శుక్రుడు అధిపతి. కుటుంబంలో సమస్యలు ఉంటాయి. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. సమాజంలో మీ ప్రతిష్ట దెబ్బ తింటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. మితిమీరిన నమ్మకం మీకు హాని కలిగిస్తుంది.
Also Read: Shani dev: ఈ 5 రాశులవారిపై శని మహాదశ.. నివారణకు ఇలా చేయండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి