COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Shukra Uday Effect on Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రంలో  ఆనందం, శ్రేయస్సు, వైభవం, ఐశ్వర్యం సూచికగా భావించే శుక్ర గ్రహం రాశి సంచారం చేయబోతోంది. శుక్రుడు ఈ రోజు కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొందరి జాతకాల్లో శుక్రుడు ప్రతికూల స్థానాల్లో ఉండబోతున్నాడు. దీంతో కొన్ని రాశులవారి జీవితాల్లో చాలా రకాల దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ పలు రాశులవారికి టెన్షన్‌ వాతావరణం నెలకొనే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ రాశులవారిపై శుక్రుడి ప్రభావం:
మిథున రాశి:

శుక్రుడి సంచారం కారణంగా  మిథున రాశికి అనేక రకాల సమస్యలు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా తీవ్ర ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ క్రమంలో ఖర్చులు రెట్టింపు అవుతాయి. కాబట్టి ఆర్థిక విషయాల పట్ల తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారికి మానసిక ఒత్తిడి పెరిగవచ్చు. ఈ సమయంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం మానుకోవాల్సి ఉంటుంది. 


తుల రాశి:
శుక్రుడు సంచారం కారణంగా తుల రాశివారి జీవితంలో కూడా చాలా రకాల మార్పులు వస్తాయి. ఉద్యోగాలు చేసేవారు ఈ క్రమంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వ్యాపారాలు చేసేవారు కూడా పెట్టుబడులు పెట్టడం మానుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్రంగా నష్టపోవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?


ధనుస్సు రాశి:
శుక్రుడు సంచార ప్రభావం ధనస్సు రాశివారిపై కూడా పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచార ప్రభావంతో అనేక రకాల సమస్యలు వచ్చే అవకావాలు ఉన్నాయి. వీరికి ప్రేమ జీవితంలో కూడా చాలా రకాల సమస్యలు రావచ్చు. కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. పిల్లల వైపు నుంచి కూడా కొన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ సమయంలో వారితో వాదనలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. 


వృశ్చిక రాశి:
శుక్రుడు సంచార చెడు ప్రభావం వృశ్చిక రాశివారిపై కూడా పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో వీరికి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చులు తగ్గించుకోవడం చాలా మేలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా కొంతమందిలో అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు.


ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి