COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Shukra Vakri 2023: జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి ఎనలేని ప్రత్యేకత ఉంది. ఈ గ్రహాన్ని శ్రేయస్సు, లగ్జరీ, శృంగారాలకు ప్రతీకగా పరిగణిస్తారు. శుక్రుడు జాతకంలో బలమైన స్థానంలో ఉంటే అదృష్టానికి లోటుండదు. అదే ఒక రాశి వారి జీవితంలో అశుభ స్థానంలో ఉంటే తీవ్ర సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే శుక్ర గ్రహం జూలై 23వ తేదీన సంచారంలో భాగంగా సింహరాశిలోకి ప్రవేశించింది. అయితే ఈ గ్రహం తీరోగమన దశలో ప్రవేశించింది. కాబట్టి కొన్ని రాశుల వారి జీవితాల్లో చాలా రకాల మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఊహించని నష్టాలు కలిగి అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.


ఈ రాశుల వారిపై శుక్రుడు ఎఫెక్ట్:
మేష రాశి:

సింహరాశిలో శుక్రుడి తిరోగమనం కారణంగా మేష రాశి వారికి తీవ్ర దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ క్రమంలో ఆర్థిక సమస్యలతో పాటు అనారోగ్య సమస్యల ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారాల్లో పెట్టుబడును పెట్టేవారు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు లేకపోతే వ్యాపారాల్లో తీవ్ర నష్టాలు వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయి. వైవాహిక జీవితం గడుపుతున్న వారు విభేదాల కారణంగా కుటుంబ సమస్యలు రావచ్చు.


కర్కాటక రాశి:
శుక్రుడి తిరోగమనం కారణంగా కర్కాటక రాశి వారు కూడా తీవ్ర ఇబ్బందుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో వైవాహిక జీవితం గడుపుతున్న వారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని వీలైనంతవరకు భాగస్వామి పట్ల మాటలను అదుపులో పెట్టుకోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇక వ్యాపారాలు చేసే వారి విషయానికొస్తే.. ఈ క్రమంలో పెట్టుబడులు పెట్టడం మానుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర ఆర్థిక సంక్షోభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా ఆఫీసుల్లో శ్రమ పెరిగి ఒత్తిడికి గురయ్యే అవకాశాలున్నాయి.


కన్యా రాశి:
శుక్రుడి చెడు ప్రభావం కారణంగా కన్యారాశి వారి జీవితాలు అనేక మార్పులు వస్తాయి వీరు ఈ క్రమంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోకపోవడం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా చెడిపోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీలైనంతవరకు ఈ క్రమంలో ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక వ్యాపారస్తులు అయితే పెట్టుబడులకు దూరంగా ఉండడమే చాలా మంచిది.. ఎందుకంటే శుక్రుడు ఆ శుభ స్థానంలో ఉండడం వల్ల మీరు ఈ క్రమంలో పెట్టుబడులు పెడితే తీవ్ర నష్టాల బారిన పడతారని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook