Kamadhenu cow tips: పూర్వ కాలంలో దేవతలు, అసురులు ఆదిశేషుడ్ని ఆసరాగా చేసుకుని మంధర పర్వతంను మధిస్తారు. అప్పుడు.. క్షీర సాగ‌రమథనంలో కామ ధేనువు కూడా బైటకు వస్తుంది. కామ ధేనువు ఎవరి దగ్గర ఉంటే వారికి ఏ విషయంలోకూడా లోటు ఉండదని చెప్తుంటారు. ఈ కామధేనువును సురభి అని కూడా పేరు ఉంది. అయితే.. కామధేనువు తమ దగ్గర ఉండాలని అసురులు ఎంతో కష్టపడ్డారంట. కానీ దేవతలు మాత్రం.. దుష్ట స్వభావం, లోకానికి చెడు చేయాలని ఆలోచన ఉన్న దుష్టులుదగ్గర పవిత్రమైన కామధేనువు ఉండకూడదని కూడా.. దేవతల దగ్గరే కామధేనువు ఉండేలా చేశారంట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పటి నుంచి కామధేనువును చాలా మంది తమ దగ్గర ఉంచుకునేందుకు రుషులు, దేవతలు సైతం ఆసక్తి చూపించారంట. ఈ క్రమంలో ప్రస్తుతం కామధేనువు.. గురించి తరచుగా మనం పండితుల సహాయంలో పలు విషయాలు తెలుసుకుంటాం. కామధేనువు అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. కామధేనువు విగ్రహంలో కూడా నిజమైన కామధేనువు ఆవులో ఉండే పవిత్రత, శక్తి ఉంటాయంట.  ముఖ్యంగా ఆవుతో పాటు.. చిన్న లేగదూడ పాలు తాగుతున్నట్లు ఉంటుంది. దీని ప్రతిమను ఇంట్లో ఉంచుకున్న గొప్ప ఫలితాలను ఇస్తుందంట. ఆవులో 33 కోట్ల దేవతలు నిత్య నివాసం చేస్తుంటారని పండితులు చెబుతుంటారు. అందుకే హిందువులు ఆవును ఎంతో పవిత్రంగా భావిస్తారు.


ఆవులో ఉన్న ప్రతి భాగం కూడా.. దేవుళ్లకు నివాస స్థలంగా చెప్తారు. అలాంటి పవిత్రమైన కామధేనువు ప్రతిమను ఇంట్లోపెట్టుకుంటే అన్ని విధాలుగా మంచి జరుగుతుందంట. చెడు ఫలితాలు కల్గేంచేవి మనకు దూరంగా వెళ్లిపోతాయంట. ఈ క్రమంలో ప్రస్తుతం కామధేనువు.. ధనాన్ని ఆకర్శిస్తుందంట. ఈ కామధేనువు ఎవరి ఇంట్లో ఉంటే వారికి డబ్బులకు ఏ మాత్రంకూడా లోటు ఉండదంట. అంతే కాకుండా.. ఆవు ప్రతిమ ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని దూరం చేస్తుందంట.


కామధేనువు ముఖ్యంగా ఇంట్లో ఒక ఎత్తులో..పెట్టుకొవాలంట. పనిమీద  బైటకు వెళ్లేటప్పుడు.. కామధేనువు ప్రతిమను చూసుకుంటూ బైటకు వెళ్లితే వెళ్లిన పని ఆగకుండా పూర్తవుతుంది. అదే విధంగా గుమ్మానికి ముందుగా.. కామాధేనువు ప్రతిమను కన్పించే విధంగా పెట్టుకొవాలి.


Read more: Salt: ఇంట్లో ఉప్పుతో ఇలా చేస్తే.. లక్ష్మీదేవి మీ ఇల్లు విడిచి వెళ్లమన్నా వెళ్లదు..


అది ధనాన్ని బైట నుంచి ఇంట్లోకి ఆకర్శిస్తుదంట. అదే విధంగా చెడుస్వభావం, చెడు గుణాలన్న వారు ఇంట్లోకి ప్రవేశించకుండా కామధేనువు నివారిస్తుదంట. అందుకే చాలా మంది తమ ఇళ్లలో కామధేనువు విగ్రహాన్ని తప్పనిసరిగా పెట్టుకుంటారు.ఈ కామధేను ఆవును బహుమతిగా ఇచ్చిన కూడా మంచి జరుగుతుందంట.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.