Signs of Lakshmidevi: ఆ చేయి దురదగా ఉందా..అయితే అదృష్టం పండినట్టే, మీపై లక్ష్మీదేవి కటాక్షం
Signs of Lakshmidevi: ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ప్రసన్నం కోసం చూస్తుంటారు. లక్ష్మీదేవి ప్రసన్నమైతే జీవితంలో చాలా సంకేతాలు ముందుగానే కన్పిస్తాయి. ఈ సంకేతాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి.
లక్ష్మీదేవి కటాక్షం కోసం అందరూ ప్రయత్నిస్తుంటారు. లక్ష్మీదేవి కటాక్షం లభించేటప్పుడు మీ చుట్టూ కొన్ని సంకేతాలు కూడా కన్పిస్తాయట. ఈ సంకేతాలు కన్పిస్తే త్వరలోనే మీకు డబ్బులు లభించవచ్చు.
హిందూమత విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవిని ధనానికి మూలంగా భావిస్తారు. అందుకే ప్రతి గురు, శుక్రవారాలు తప్పకుండా లక్మీదేవిని పూజిస్తుంటారు. లక్ష్మీదేవిని నిబద్ధతతో పూజిస్తే ఆర్ధిక కష్టాలు దూరమౌతాయని నమ్మకం. లక్ష్మీదేవి ప్రసన్నమయ్యే ముందు కొన్ని సూచనలు తప్పకుండా కన్పిస్తాయట. ఆ సంకేతాల్ని బట్టి లక్ష్మీదేవి ప్రసన్నం కానుందని అర్ధం చేసుకోవచ్చు. లక్ష్మీదేవి ప్రసన్నమయ్యే ముందు ఎలాంటి లక్షణాలు, సంకేతాలు కన్పిస్తాయో తెలుసుకుందాం..
ఒకవేళ కుడిచేతిలో దురద కన్పిస్తే..త్వరలోనే డబ్బులు వచ్చి పడతాయని అర్ధం చేసుకోవచ్చు.
ఒకవేళ ఏదైనా పని విషయమై బయటకు వెళ్తుంటే దారిలో చెరకు కన్పిస్తే లక్ష్మీదేవి కటాక్షానికి సంకేతం కావచ్చు
మీ ఇంట్లో పిచ్చుకలు, పావురాలు గూడు కట్టుకున్నాయంటే శుభసూచకమని అర్ధం. త్వరలోనే మీపై లక్ష్మీదేవి కటాక్షం కలగనుందని అర్ధం.
మీ ఇంటి గోడపై మూడు బల్లులు ఒకేసారి కన్పించినా చాలా శుభసూచకమవుతుంది. దీనర్ధం మీ ఇంట్లో త్వరలోనే ధనం వర్షిస్తుంది.
ఒకవేళ మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎవరినైనా చీపురు ఊడ్వటం చూస్తే..ఇది కూడా శుభసూచకం కావచ్చు. అంటే మీరు ఏ పనిపై వెళ్తున్నారో ఆ పనిలో ఏ విధమైన ఇబ్బందుల్లేవని అర్ధం.
మీ ఇంట్లో నల్ల చీమల దండు కన్పిస్తే లక్ష్మీదేవి కటాక్షం త్వరలో ఉంటుందని అర్ధం చేసుకోవచ్చు. ఈ సంకేతాలు మీ చుట్టుపక్కల కన్పించాయంటే త్వరలో మీ ఆర్ధిక కష్టాలు తీరనున్నాయని అర్ధం.
Also read: Vastu Tips: బకెట్ నీళ్లతో అప్పులు దూరం చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook