Silver Brick Benefits: ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు ఉండాలని..ధన సంపద వచ్చిపడాలని అందరికీ ఉంటుంది. దీనికోసం కొన్ని మార్గాలు కూడా అనుసరిస్తుంటారు. ఇందులో ఒకటి ఇంటి ఖజానాలో ఇటుక అమర్చుకోవడం. ఆశ్చర్యంగా ఉందా..ఆ వివరాలేంటో పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తరాదిన చాలా మంది ఇళ్లలో..ఖజానాలో వెండితో చేసిన ఇటుకను ఉంచుకుంటారు. ఇలా ఎందుకనుకుంటున్నారా..ఇలా చేయడం వల్ల ఆ ఇంటి అదృష్టం మారిపోతుందని నమ్మకం. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని అంటారు. వివిధ మార్గాల్నించి డబ్బు వచ్చి పడుతుందట. ఇప్పుడైతే ఖజానాలో ఇలా వెండి ఇటుకను పెట్టుకుంటున్నారు. కానీ పాతకాలంలో అయితే ఇంటి పునాదిలోనే వెండి ఇటుక అమర్చుకునేవారట. 


ఇంటి ఖజానాలో వెండి ఇటుకను అమర్చడం వల్ల ఆ ఇంట్లో సుఖ శాంతులు, ధన సంపద ఉంటాయనేది ఓ నమ్మకం. హిందూమతంలో వెండి ఇటుకకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇంటి పునాదిలో వెండి ఇటుక ఉంటే..ఇంట్లో సుఖ శాంతులు వర్ధిల్లడమే కాకుండా..కీర్తి, వైభవం, అభివృద్ధి సమస్తం లభిస్తాయి. ఒకవేళ ఇంటి ఖజానాలో వెండి ఇటుక పెడితే..డబ్బు సమస్య ఎప్పుడూ తలెత్తదు. ఇంట్లో డబ్బుకు స్థిరత్వం లభిస్తుంది. ఖజానా ఎప్పుడూ ఖాళీ కాకుండా ఉంటుంది. 


మీ ఇంటి ఖజానాలో వెండి ఇటుక ఉంటే..బంధాల్లో మాధుర్యం ఉంటుంది. ఒకరిపై మరొకరికి ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి. వెండి ఇటుక కారణంగా దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు, మనశ్సాంతి లభిస్తాయి. లేదా భార్యకు వెండి ఇటుకను కానుకగా ఇచ్చినా మంచి ఫలితాలుంటాయి. పిల్లల కెరీర్ విషయంలో ఏదైనా సమస్యలున్నా..వెండి ఇటుకను పిల్లలకు బహుమానంగా ఇస్తే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ఒత్తిడి, ఆందోళన దూరమౌతాయి. పిల్లల కెరీర్‌లో కూడా ఎదుగుదల కన్పిస్తుంది. 


Also read: Artificial Flowers: ఇంట్లో ఆర్టిఫిషియల్ పూలుంటే..సర్వ నాశనమేనా, మరేం చేయాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook