Skand Shashthi 2022: స్కంద షష్ఠి వ్రతం ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏమిటి?
Skand Shashthi 2022: ఈ ఏడాది స్కంద షష్ఠి వ్రతం జూలై 04న వస్తుంది. కుమార స్వామిని పూజించడం వల్ల మీ పిల్లలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి.
Skand Shashthi 2022 Significance: ఆషాఢ మాసం శుక్ల పక్షంలోని ఆరో రోజున స్కంద షష్ఠి వ్రతం పాటిస్తారు. ఈ స్కంద షష్ఠి వ్రతాన్నే 'సంతాన షష్ఠి' అని కూడా అంటారు. ఈ ఏడాది స్కంద షష్ఠి వ్రతం (Skand Shashthi 2022) జూలై 04 సోమవారం వస్తుంది. ఈ రోజున స్కందుడు అంటే కుమార స్వామిని పూజిస్తారు. పురాణాలలో అతిపెద్ద పురాణమైన స్కంద పూరాణంలో స్కంద షష్ఠి వ్రత్రం యెుక్క ప్రాధాన్యత చెప్పబడింది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పిల్లలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. స్కంద షష్ఠి వ్రతం ముహూర్తం, పూజ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్కంద షష్ఠి వ్రతం 2022 తేదీ
పంచాంగం ప్రకారం, ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష షష్ఠి తిథి జూలై 04, సోమవారం సాయంత్రం 06.32 గంటలకు ప్రారంభమై... జూలై 05, సాయంత్రం 07:28కి ముగుస్తుంది. జూలై 04 న వ్రతాన్ని ఆచరిస్తారు.
స్కంద షష్ఠి 2022 ముహూర్తం
స్కంద షష్ఠి వ్రతం రోజునే సిద్ధి యోగం, రవియోగం ఏర్పడుతున్నాయి. సిద్ధియోగం ఉదయం నుండి మధ్యాహ్నం 12.22 వరకు, రవియోగం జూలై 05వ తేదీ ఉదయం 08.44 నుండి మరుసటి రోజు ఉదయం 05.28 వరకు ఉంటుంది. ఈ యోగాల్లో శుభకార్యాలు చేయడం చాలా మంచిది. ఈ రోజు రాహుకాలం ఉదయం 07:12 నుండి ఉదయం 08:57 వరకు ఉంటుంది. రాహుకాలంలో శుభ కార్యాలు చేయవద్దు.
స్కంద షష్ఠి ప్రాముఖ్యత
ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మీ పిల్లలకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. స్కంద పురాణం ప్రకారం, చ్యవన ఋషి తన కంటి చూపు కోల్పోయినప్పుడు, అతను ఈ వ్రతం పాటించి కుమార స్వామిని పూజించాడు. ఈ వ్రత మహిమ వల్ల అతడికి కంటి చూపు తిరిగి వచ్చింది.
Also Read: Sravana Masam 2022: శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభం? ఏం చేస్తే శివుడు అనుగ్రహిస్తాడు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి