Sravana Masam 2022: శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభం? ఏం చేస్తే శివుడు అనుగ్రహిస్తాడు?

Sawan Month 2022: వచ్చే నెలలో శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఈ మాసం పరమశివుడికి ఎంతో ఇష్టమైనది. శ్రావణ మాసంలో  ఈ చర్యలు చేయడం ద్వారా మీ కోరికలు నెరవేరుతాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 30, 2022, 12:41 PM IST
  • జూలై 14న శ్రావణ మాసం ప్రారంభం
  • ఈ నెల శివుడికి ఎంతో ప్రీతికరమైనది
  • ఈ మాసంలో ఈ పరిహారాలు చేయండి
Sravana Masam 2022:  శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభం? ఏం చేస్తే శివుడు అనుగ్రహిస్తాడు?

Sravana Masam Significance:  శ్రావణ మాసం శివుడికి (Lord Shiva) ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ ఏడాది శ్రావణ మాసం జూలై 14న ప్రారంభమై.. ఆగస్టు 12 వరకు ఉంటుంది. ఈ మాసంలోని (Sravana Masam 2022) సోమవారాల్లో మహిళలు ఉపవాసాలు ఉంటూ.. నోములు, వ్రతాలు, పూజలు చేస్తారు.  ఈ ఏడాది శ్రావణంలో 5 సోమవారాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ మాసంలో కొన్ని ముఖ్యమైన పండుగలు కూడా వచ్చాయి. ఆగస్టు 2న నాగపంచమి, ఆగస్టు 11న రక్షాబంధన్‌ జరుపుకోనున్నారు. అంతేకాకుండా ఈ మాసంలోనే శని, గురు గ్రహాలు  తమ రాశిని మార్చబోతున్నాయి. 

శ్రావణ మాసం ప్రారంభం కాకముందే శని తన రాశిని మార్చనుంది. ప్రస్తుతం కుంభరాశిలో తిరోగమనంలో  ఉన్న శని.. ఆ రాశిని వదిలి మకరరాశిలోకి ప్రవేశించనుంది. మరోవైపు జూలై 29న, బృహస్పతి తన సొంత రాశి అయిన మీనరాశిలో తిరోగమనం  చెందనున్నాడు. ముఖ్యమైన ఈ రెండు గ్రహాల మార్పు ప్రభావం  ప్రజలపై ఉంటుంది. ఈ గ్రహాల శుభఫలితాలు పొందాలంటే శ్రావణ మాసంలో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. దీనితోపాటు నవగ్రహాల దోషాలు తొలగిపోవడానికి శ్రావణ మాసం ఎంతో ముఖ్యమైనది. 

శ్రావణంలో ఈ చర్యలు చేయండి
>> జీవితంలోని అన్ని దుఃఖాలు మరియు బాధలను తొలగిపోవాలంటే.. శ్రావణంలో మహాదేవుడిని పూజించండి. అంతేకాకుండా శ్రావణంలో  రుద్రాభిషేకం చేయడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి.
>> పంచామృతం, గంట, దాతుర, చందనం, తెల్లని పూలు మొదలైన వాటిని శివునికి సమర్పించండి.
>> శ్రావణ మాసంలో సూర్యుని పూజించి.. అర్ఘ్యం సమర్పించండి.  
>> ఈ మాసంలోని అన్ని శనివారాలలో నూనె మరియు నల్ల నువ్వులను దానం చేయండి. అంతేకాకుండా గొడుగులు, బూట్లు మరియు చెప్పులు దానం చేయడం కూడా శుభప్రదమని నమ్ముతారు. 
>> శ్రావణ మాసంలోని గురువారం నాడు పసుపు, శనగ దానం చేయండి. ఇలా చేయడం వల్ల గురు గ్రహం సంతోషిస్తుంది.

Also Read; Chaturmas 2022: చాతుర్మాసంలో ఈ 5 పనులు చేయడం ద్వారా.. మీ కోరికలు నెరవేరుతాయి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x