Remedy for Financial Problems: హిందూ మత సంప్రదాయంలో తమలపాకులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఏ దేవుడు లేదా దేవతనైనా కొలిచే సమయంలో ఏదో విధంగా తమలపాకులను వినియోగిస్తూ ఉంటారు. పురణాల ప్రకారం.. క్షీర సాగర మథనం సమయంలో దేవతలందరూ తమలపాకులను ఉపయోగించిన విష్ణువుని పూజించారని తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు ఆంజనేయస్వామికి కూడా తమలపాకులు ప్రీతి పాత్రమైనవని మన పెద్దలు చెబుతుంటారు. దేవుళ్లను పూజించడం సహా జోతిష్యం, మంత్రతంత్రాదులకు కూడా తమలపాకులను వినియోగిస్తుంటారు. అలాంటి తమలపాకుల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. తమలపాకుల వినియోగం వల్ల అనేక సానుకూల ప్రభావాలు ఉన్నాయి. 


ఇంట్లో ప్రతికూలతలకు పరిహారం


ప్రతిరోజు చేసే పూజలో తమలపాకులను ఉపయోగించడం వల్ల దేవతలను సంతోషపరిచినట్లు అవుతుంది. దీంతో ఇంటిలోని ప్రతికూలత తొలగిపోయి ఇల్లు సానుకూలతతో నిండిపోతుందని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి.


ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడం


ఈ తమలపాకులతో ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకుంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వడం సహా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మంగళవారం లేదా శనివారం ఉదయం హనుమాన్ ఆలయానికి వెళ్లి తమలపాకులతో పూజ నిర్వహించాలి. తద్వారా అన్ని కష్టాలు తొలగిపోతాయి. 


వ్యాపారంలో వృద్ధి


వ్యాపారులు తమ దుకాణాల్లో 5 పెసర ఆకులు, 8 తమలపాకులు తీసుకొని వాటిని ఒక దారానికి కట్టి దుకాణానికి తూర్పు దిక్కున కట్టాలి. మరుసటి శనివారం కొత్త ఆకుల దండను కట్టేముందు.. పాట వాటిని తీసి నదిలో లేదా బావిలో వేయాలి. ఇలా ఐదు శనివారాలు చేస్తే వ్యాపారంలో వృద్ధి లభిస్తోంది. 


నోట్: ఇక్కడ పొందుపరిచిన సమాచారమంతా కొన్ని హిందూ శాస్త్రాల నుంచి గ్రహించినది. ZEE హిందూస్థాన్ న్యూస్ దాన్ని ధ్రువీకరించడం లేదు. 


Also Read: Today's Horoscope: 4-1-2022 మంగళవారం.. ఆ రాశి వారు కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి!!


Also Read: Zodiac Signs : 2022లో ఈ మూడు రాశుల వారు జాగ్రత్త..చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి