Solar Eclipse 2022: సూర్య గ్రహణం సమయంలో తప్పకుండా చేయాల్సిన 5 పనులు, కలిగే ప్రయోజనాలు
Solar Eclipse 2022: సూర్య గ్రహణం సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయంపై శాస్త్రాల్లో స్పష్టత ఉంది. మత గ్రంథాల ప్రకారం గ్రహణం సమయంలో కొన్ని పనులు చేయడం వల్ల విశేషమైన లాభాలు కలుగుతాయి.
Solar Eclipse 2022: సైన్స్ ప్రకారమైనా, మత ఆచారాల ప్రకారమైనా సూర్య గ్రహణానికి విశేష ప్రాధాన్యత ఉంది. సూర్య గ్రహణం విషయంలో చాలా నమ్మకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఎప్పుడు, ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయంపై ప్రస్తావన వివరంగా ఉంది. ఆ వివరాలు మీ కోసం..
సూర్య గ్రహణం సమయంలో ఏ విధమైన శుభ కార్యాలు తలపెట్టకూడదని నమ్మకం. సూర్య గ్రహణం సమయంలో ఎక్కడికీ వెళ్లకుండా దేవుడిని స్మరించుకుంటూ ఉండాలి. పూజా మందిరాన్ని లేదా దేవుడి విగ్రహాన్ని ముట్టుకోకుండా..మంత్రాలు పఠించుకుంటూ పూజ కొనసాగించాలి. కొన్ని పనులు చేయడం వల్ల అంతులేని లాభాలు కూడా కలుగుతాయని భావిస్తున్నారు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్య గ్రహణం సమయంలో మంత్రాల్ని పఠించడం వల్ల విశేష మహత్యముంటుంది. ఈ సమయంలో సూక్ష్మ జపం అత్యంత ప్రయోజనకరం. ఈ సమయంలో రుద్రాక్ష ధరించడం వల్ల పాపాలు తొలగిపోతాయి. అయితే రుద్రాక్ష అసలైంది కావాలి.
సూర్య గ్రహణం సమయంలో ఎవరైనా స్వామీజి లేదా గురువు నుంచి దీక్ష స్వీకరించడం అత్యంత లాభాదాయకం. సూర్య గ్రహణం సమయంలో దీక్ష స్వీకరిస్తే ప్రయోజనకరం. సూర్య గ్రహణం సందర్భంగా ఎవరైనా జపం చేయడం వల్ల పది లక్షల రెట్ల లాభం కలుగుతుంది.
జ్యోతిష్యం ప్రకారం సూర్య గ్రహణం సమయంలో మహాభారత్, రామాయణం వంటి మత గ్రంథాల్ని పఠించాలి. గర్భిణీ మహిళలు ఇవి చదవడం వల్ల పుట్టబోయే పిల్లల పెరుగుదల బాగుంటుంది. దాంతోపాటు పిల్లల్లో సంస్కారం కూడా ఉంటుంది.
పాటించవాల్సిన మంత్రాలు ఇవే:
[[{"fid":"249867","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
Also read: Surya grahanam 2022: సూర్య గ్రహణం తరువాత తూచా తప్పకుండా చేయాల్సిన పనులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook