సూర్య గ్రహణం సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు జ్యోతిష్యులు. కొన్ని పనులు అస్సలు చేయకూడదంటారు. మరి సూర్య గ్రహణం తరువాత ఏం చేయాలి, శాస్త్రం ఏం చెబుతోంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్య గ్రహణం అనేది ఓ అశుభ ఘటన. ఈ సమయంలో కొన్ని రకాల పనులు చేయకూడదు. ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం అక్టోబర్ 25 అంటే ఇవాళే. ఇది పాక్షిక సూర్య గ్రహణం. సూర్య గ్రహణం ప్రారంభానికి 12 గంటల ముందు నుంచే గ్రహణకాలం మొదలవుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు పూజలు చేయకూడదు. దేవుడిని స్మరించుకుంటూ ఉండాలి. అయితే సూర్య గ్రహణం ముగిసిన వెంటనే కొన్ని పనులు తప్పకుండా చేయాలని ఉంది. సూర్య గ్రహణం ఇవాళ మద్యాహ్నం 2 గంటల 29 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఇండియాలో మాత్రం సాయంత్ర 4 గంటల 29 నిమిషాలకు మొదలవుతుంది. గ్రహణం సాయంత్రం 6 గంటల 32 నిమిషాలకు పూర్తవుతుంది. సూర్య గ్రహణం ముగిసిన వెంటనే ఏ పనులు చేయాలో చూద్దాం..
సూర్యగ్రహణం ముగిసిన వెంటనే ముందు ఇంట్లో ఉన్న తులసి మొక్కపై గంగాజలం చల్లి..శుద్ధి చేయాలి. సూర్య గ్రహణం సమయంలో పూజలు చేయకూడదు. అయితే సూర్య గ్రహణం పూర్తయిన వెంటనే అన్ని పూజ గదుల్లో గంగాజనం చల్లాలి. ఇలా చేయడం వల్ల నెగెటివ్ శక్తి తొలగిపోతుందని నమ్మకం. సూర్య గ్రహణం సమయంలో గర్భిణీ మహిళలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే కడుపులో చిన్నారిపై కూడా గ్రహణం ప్రభావం పడుతుంది. సూర్య గ్రహణం పూర్తయిన వెంటనే..స్నానం చేయాలి.
సూర్య గ్రహణం పూర్తయిన వెంటనే..నువ్వులు లేదా శెనగపప్పు దానం చేయడం మంచిదని విశ్వసిస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలో అన్ని సమస్యలు దూరమౌతాయి. సూర్య గ్రహణం పూర్తయిన వెంటనే ముందుగా స్నానం చేయాలి. ఇంట్లో చీపురుతో మొత్తం తుడవాలి. ఫలితంగా నెగెటివ్ శక్తి ఆగిపోతుంది. సూర్య గ్రహణం పూర్తయిన వెంటనే..దేవీ దేవతల దర్శనం చేసుకోవాలి. గంగాజలంతో శుభ్రం చేయాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Surya grahanam 2022: సూర్య గ్రహణం తరువాత తూచా తప్పకుండా చేయాల్సిన పనులు