Surya Grahanam 2022: దీపావళి మరుసటి రోజు అంటే అక్టోబర్ 25న ఉంది. ఈ ఏడాదిలో ఇదే చివరి సూర్య గ్రహణం. సరిగ్గా దీపావళి మరుసటి రోజు రావడంతో కొన్ని రాశులకు ఊహించని ప్రయోజనం కలగనుందని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీపావళి మరుసటి రోజు అంటే అక్టోబర్ 25న 2022లో చివరి సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఇది పాక్షిక సూర్య గ్రహణం. ఐదురోజుల దీపావళి పండుగపై సూర్య గ్రహణం ప్రభావం పడనుంది. సూర్య గ్రహణం ప్రభావం అన్ని రాశులపై పడుతున్నా..కొన్నిరాశులకు మాత్రం పూర్తిగా శుభసూచకంగా ఉండనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..


సింహరాశివారిపై సూర్య గ్రహణం ప్రభావం చాలా లాభదాయకంగా ఉండనుంది. చాలాకాలంగా నిలిచిపోయిన డబ్బు ఒక్కసారిగా చేతికి అందుతుంది. అంతులేని ధనలాభం కలుగుతుంది. ఉద్యోగంలో వృద్ధి కలగడమే కాకుండా..కొత్త అవకాశాలు లభిస్తాయి. పనుల్లో విజయం లభిస్తుంది. 


కర్కాటక రాశివారిపై సూర్య గ్రహణం ప్రభావం పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. వీరికి కూడా నిలిచిపోయిన డబ్బు తిరిగి లభిస్తుంది. ప్రతి పనిలో విజయం దక్కుతుంది. వాహనాలు, భూమి, భవనాలు  కొనుగోలు చేస్తారు. దీనికి ఈ సమయం చాలా అనుకూలం కూడా.


మీనరాశివారికి సూర్య గ్రహణం ప్రభావం ప్రయోజనకరంగా ఉంటుంది. ఊహించని ధనలాభం కలుగుతుంది. ఈరాశివారికి నిలిచిపోయిన డబ్బు పెద్దమొత్తంలో లభిస్తుంది. పెట్టుబడులు పెడితే మంచి లాభాలు ఆర్జిస్తారు.


ధనస్సురాశివారికి సూర్య గ్రహణం ప్రభావం శుభంగా ఉంటుంది. పలు మార్గాల్నించి సంపద లభిస్తుంది. అభివృద్ధి ఉంటుంది. పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంచి సమయం. అధిక లాభాలు సాధిస్తారు.


Also read; Dhanteras 2022: దంతేరస్ నాడు గిన్నెలు, పాత్రలు ఎందుకు కొంటారు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook