Solar Eclipse 2023: సూర్య గ్రహణం ఎప్పుడు, ఏ సమయంలో, ఇండియాలో ఉంటుందా లేదా
Solar Eclipse 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్య గ్రహానికి అత్యంత మహత్యముంది. భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు రావడం వల్ల సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ నెలలో ఏర్పడనుంది. ఆ వివరాలు మీ కోసం..
కొత్త సంవత్సరంలో తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ నెలలో ఏర్పడనుంది. సూర్య గ్రహణం అనేది భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు రావడం వల్ల ఏర్పడుతుంది. సూర్య గ్రహణం ప్రభావం కొన్ని రాశులపై అనుకూలంగా..కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్య గ్రహణం ఎల్లప్పుడూ అమావాస్య తిధినాడు ఏర్పడుతుంది. ఈసారి సూర్య గ్రహణం ఏప్రిల్ 20, 2023న ఏర్పడనుంది. ఈసారి సూర్య గ్రహణం సమయం ఉదయం 7 గంటల 4 నిమిషాల్నించి మద్యాహ్నం 12 గంటల 29 నిమిషాల వరకూ ఉంటుంది. ఈ సందర్భంగా పూజాది కార్యక్రమాలకు అత్యంత మహత్యముంటుంది. సూర్య గ్రహణం సూతక కాలం ఏ రాశులపై ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం..
సూర్య గ్రహణం సమయం ఎప్పుడంటే
హిందూ పంచాంగం ప్రకారం సూర్య గ్రహణం వైశాఖ మాసంలోని కృష్ణపక్షం అమావాస్య తిధి రోజున ఉంటుంది. ఈ రోజున ఏప్రిల్ 20వ తేదీ గురువారం నాడు ఉంది. ఉదయం 7 గంటల 4 నిమిషాల నుంచి మద్యాహ్నం 12 గంటల 29 నిమిషాల వరకూ ఉంటుంది. సూర్య గ్రహణం ఇండియాలో కన్పించదు. అందుకే సూతకకాలం వర్తించదు. ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం జపాన్, సమోవా, సోలోమన్, బరూనీ, కంబోడియా, చైనా, అమెరికా, పాపువా న్యూ గినీ, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మైక్రోనేషియా, దక్షిణ పసిఫిక్ సాగర్, తిమోర్, న్యూజిలాండ్, మలేషియా, ఫిజీ, సింగపూర్, ధాయ్‌లాండ్, అంటార్కిటికీ, ఆస్ట్రేలియా, వియత్నాం, తైవాన్, దక్షిణ హిందూ మహాసాగర్ ప్రాంతాల్లో కన్పించనుంది.
శాస్త్రవేత్తల ప్రకారం ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఇండియాలో కన్పించదు. ఫలితంగా సూతకకాలం కూడా ఉండదు. ఈ గ్రహణం కంకణాకృతిలో ఉంటుంది. సూర్యుడి ఉచ్ఛ రాశి మేషం, కేతువు నక్షత్రం అశ్విని. అందుకే తీవ్ర ప్రభావముంటుంది.
20 ఏప్రిల్ 2023 తొలి సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఈ సందర్భంగా సూర్యుడు మేష రాశిలో ప్రవేశించనున్నాడు. సూర్యుడి ఉచ్ఛరాశి మేషంలో ఉండటంతో ఈ రాశివారికి విశేష లాభాలుంటాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడి ఉచ్ఛరాశి మేషం కావడం వల్ల ఈ రాశి జాతకులకు ఆర్ధిక లాభముంటుంది. ఈ రాశివారికి గౌరవ మర్యాదలు, పదవి, ప్రతిష్ఠ పెరుగుతుంది. ప్రతి రంగంలో సాఫల్యముంటుంది.
Also read: Adani Group: అదానీ గ్రూప్‌కు ఇచ్చిన రుణాలపై ఎస్బీఐ వివరణ, మొత్తం అప్పు ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook