COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Solar Eclipse 2023 Date and Time: సంవత్సరంలో రెండవ, చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 14న ఏర్పడబోతోంది. ఇదే రోజు సర్వపిత్రి అమావాస్య కూడా రాబోతోంది. ఈ సూర్యగ్రహణాన్ని ఖగోళ సంఘటనగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఈ గ్రహణానికి శాస్త్రీయ, మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం వార్షికంగా ఉండబోతోంది. కాబట్టి దీనికి సూతక కాలం కూడా చెల్లుబాటు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ గ్రహణం గురించి చాలా మందికి ఎన్నో అపోహలు ఉన్నాయి. అయితే రాబోయే సూర్యగ్రహణానికి సంబంధించిన అన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


ఇది రెండవ సూర్యగ్రహణం:
ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 14 రాత్రి 08:34 గంటలకు ప్రారంభమవుతుందని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆ తర్వాత తెల్లవారుజామున 02:25 గంటలకు ముగుస్తుంది. అయితే అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ 14న ఏర్పడబోయే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. అంతేకాకుండా సూతక కాలం కూడా చెల్లుబాటు కాదు. 


ఏ రాశివారిపై సూర్యగ్రహణం ఎఫెక్ట్‌ పడుతుందంటే:
అక్టోబర్ 14న ఏర్పడబోయే రెండవ, చివరి సూర్యగ్రహణం ప్రభావం కొన్ని రాశులవారిపై పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సూర్యగ్రహణం కన్య, చిత్ర నక్షత్రాలలో జరగబోతోంది. దీంతో మేష, కర్కాటక, తుల, మకర రాశులవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


సూతక కాలం చెల్లుబాటు కాకపోవడానికి కారణాలు:
సూర్యగ్రహణం ప్రభావిత ప్రాంతాల్లో మాత్రమే సూతక కాలం చెల్లుబాటు అవుతుంది. ఏ గ్రహణానికైన సుతక కాలం 12 గంటల ముందు ప్రారంభమవుతుంది. ఈ సమయంలో దేవతా మూర్తులకు పూజలు చేయడం నిషేదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.  


సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా?:
ఈ సంవత్సరంలో జరిగే రెండవ సూర్యగ్రహణం ఉత్తర అమెరికా, కెనడా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, గ్వాటెమాల, మెక్సికో, అర్జెంటీనాలతో పాటు కొలంబియా, క్యూబా, పెరూ, ఉరుగ్వే, ఆంటిగ్వా, జమైకా, హైతీలలో కనిపిస్తుందని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలిపారు. దీంతో పాటు పరాగ్వే, బ్రెజిల్, డొమినికా, బహామాస్, బార్బడోస్ మొదలైన ప్రదేశాలలో కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి.


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి