Solar Eclipse 2023 in India Visiblity:  ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న ఏర్పడబోతుంది. హిందువులు గ్రహణాన్ని అశుభంగా భావిస్తారు. ఆ సమయంలో ఎటువంటి శుభకార్యాలు గానీ, పూజలు కానీ చేయరు. చేపట్టరు. ఆలయాలు మూసి  ఉంచుతారు. ఏప్రిల్ ఏర్పడబోయే గ్రహణ ప్రభావం మెుత్తం 12 రాశులపై కనిపిస్తుంది. సూర్యగ్రహణం ఏ రాశుల వారిపై చెడు ప్రభావం చూపతుందో తెలుసుకుందాం . 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యగ్రహణం 3 రాశుల వారికి అశుభం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష, కన్యా, సింహ రాశి వారికి ఈ సూర్యగ్రహణం మంచిది కాదు. ఈ గ్రహణం మేషరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఈరాశివారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మిగతా రెండు రాశులవారు కూడా అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఏప్రిల్ 20న ఏర్పడబోయే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. అందుకే దాని సూతక్ కాలం కూడా చెల్లదు మరియు ప్రజల జీవితాలపై పెద్దగా ప్రభావం చూపదు. ఈ సూర్యగ్రహణం ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, హిందూ మహాసముద్రం మరియు అంటార్కిటికా వంటి ప్రదేశాలలో కనిపిస్తుంది. ఈ దేశాల ప్రజలను కూడా ప్రభావితం చేస్తుంది. మేషం, కన్యారాశి మరియు సింహరాశి వారు ఏప్రిల్‌లో ఈ ప్రదేశాలకు వెళ్తున్నట్లయితే.. కాస్తా జాగ్రత్తగా ఉండండి.  


Also Read: Guru Shukra Gochar: యవ్వనంలోకి ప్రవేశించిన గురుడు-శుక్రుడు.. ఈ 4 రాశులకు అపారమైన ధనం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook