Solar Eclipse 2023: సూర్య గ్రహణం రోజు ఏర్పడుతున్న యుతి, ఈ రాశులకు అన్నీ ఎదురుదెబ్బలే
Solar Eclipse 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలిక, రాశి పరివర్తనం ప్రభావం మనిషి జీవితంపై తప్పకుండా ఉంటుంది. ప్రతి గ్రహం ఏదో ఒక రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఫలితంగా అన్ని రాశులపై ఆ ప్రభావం పడుతుంటుంది. అదే విధంగా సూర్య గ్రహణం ప్రభావం కూడా రాశుల్ని బట్టి వేర్వేరుగా ఉంటుంది.
Solar Eclipse 2023: హిందూ పంచాంగంలో కొన్ని గ్రహాల యుతిని అత్యంత శుభప్రదంగా భావిస్తారు. మంగళ, బుధ గ్రహాల యుతి ఇందులో ప్రధానమైంది. ఏప్రిల్ 20న ఏర్పడనున్న ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం రోజు మంగళ, బుధ గ్రహాల యుతి ఏర్పడనుంది. ఆ ప్రభావం ఏయే రాశులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
ఈ ఏడాది అంటే 2023లో తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 20వ తేదీన ఉంది. ఈసారి సూర్య గ్రహణం మేష రాశిలోని అశ్వనీ నక్షత్రంలో ప్రవేశించనుంది. మరోవైపు ఇదే రోజున గ్రహాల ప్రత్యేక సంయోగం ఏర్పడుతోంది. మంగళ గ్రహం మిథున రాశిలో, బుధుడు మేష రాశిలో ఉండటం వల్ల అత్యంత అశుభంగా భావిస్తారు. ఎందుకంటే మంగళ గ్రహం మేషరాశికి, మిధున రాశి బుధుడికి అధిపతులు. దాంతో పాటు సూర్య గ్రహణం సమయానికి సూర్యుడు మేషరాశిలో రాహువు, బుధుడితో కలిసి ఉంటాడు. బుధ, మంగళ గ్రహాలు వేర్వేరు రాశుల్లో ఉండటం వల్ల పరివర్తన యోగం ఏర్పడుతోంది. దీని ప్రభావం అన్ని రాశులపై స్పష్టంగా కన్పిస్తుంది. కానీ కొన్ని రాశులపై నెగెటివ్ ప్రభావం చూపిస్తుందంటున్నారు.
తుల రాశి
పనిచేసే చోట మార్పులు ఇబ్బంది కల్గించవచ్చు. వ్యాపార భాగస్వామితో విభేదాలు కూడా రావచ్చు. పెట్టుబడి పెట్టేందుకు అనుకూలమైన సమయం కాదంటున్నారు. పూర్వీకుల సంపద విషయంలో ఊహించని లాభం కలగనుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆరోగ్యపరంగా ఈ గోచారం మంచిది కాదు. ఆర్ధిక ఇబ్బందులు పెద్దగా ఉండవు.
వృషభ రాశి
ఈ రాశివారికి సూర్య గ్రహణం, గ్రహాల గోచారం ప్రభావం మంచిది కాదు. మీరు ఊహించినట్టు జరిగే పరిస్థితి ఉండదు. ఆత్మ విశ్వాసంతో పనిచేయాలి. భవిష్యత్ గురించి ఆందోళన చెందవద్దంటున్నారు. ఈ విషయాలు అనవసరంగా వివాదం పెంచుతుంది. గొడవలు జరిగే అవకాశాలున్నాయి. పెట్టుబడులకు దూరం పాటించాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఆర్ధిక ఇబ్బందులుంటాయి.
మకర రాశి
మకర రాశి జాతకులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరమౌతాయి. ముఖ్యంగా కంటచి వెలుగు దెబ్బతినచ్చు. జలుబు, దగ్గు, జ్వరం సమస్యల్ని ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టమంటున్నారు. పనిచేసే చోట అలసట, బద్ధకంగా ఉంటుంది. రోజూ యోగా సాధన ద్వారా వీటీని దూర చేసుకోవచ్చు.
మేష రాశి
జ్యోతిష్యం ప్రకారం మేష రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పరివర్తనం లేదా గోచారం అత్యంత అశుభం కల్గించనుంది. ఈ సందర్భంగా మీలోని ఆత్మ విశ్వాసం దెబ్బతినవచ్చు. చట్టపరమైన కేసులో ఇరుక్కుంటారు. వ్యాపారులకు నష్టం. ఎందులోనైనా పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉంటే ప్రస్తుతానికి విరమించుకోండి. ధనహాని కలుగుతుంది. బంధాలు సరిగ్గా ఉండవు. అనవసర ఖర్చులు పెరిగిపోతాయి.
కన్యా రాశి
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ సమయం కన్యా రాశి జాతకులకు అశుభం. ఈ సమయంలో మానసికంగా సమస్య ఎదురుకావచ్చు. ఇంట్లో పరిస్థితులు బాగుండవు. కుటంబసభ్యుల్లో విభేదాలుటాయి. ఇంట్లో సుఖ శాంతులు కొనసాగించే ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే గొడవలు రావచ్చు. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్ధిక ఇబ్బందులుంటాయి.
Also read: Solar Eclipse 2023: మొదటి సూర్యగ్రహణంలో సూతక కాలం ఉంటుందా, ఉంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook