Solar Eclipse 2023: మొదటి సూర్యగ్రహణంలో సూతక కాలం ఉంటుందా, ఉంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

Solar Eclipse 2023 In India: ఈ సంవత్సరం ఏర్పడబోయే సూర్యగ్రహణం భారత్‌లో కనిపించదు కాబట్టి సూతక కాలం ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 15, 2023, 10:14 AM IST
Solar Eclipse 2023: మొదటి సూర్యగ్రహణంలో సూతక కాలం ఉంటుందా, ఉంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

Solar Eclipse 2023 In India: ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20వ తేదిన ఏర్పడబోతోంది. ఖగోళ శాస్త్రంలో సూర్యగ్రహణం ఒక ప్రత్యేక సంఘటన. అయితే ఈ 2023 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం అయినప్పటికీ భారత్‌లో కనిపించకపోవడం విశేషం. కాబట్టి ఈ గ్రహణానికి ఎలాంటి మతపరమైన ప్రాముఖ్యత కలిగి ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మంది ప్రజల్లో సూతకాలానికి సంబంధించి ప్రశ్నలు తలెత్తవచ్చు. అయితే దీనికి మీ మనస్సులో ఉన్న సందేహాలకు సంబంధించిన ప్రశ్నలకు మేము సమాధానాలు తెలపబోతున్నాం..

సూర్యగ్రహణం తేదీ వివరాలు:
ఈ సంవత్సరం సూర్యగ్రహణం 20 ఏప్రిల్ 2023న ఏర్పడబోతోంది. గ్రహణం ఉదయం 7.05 నుంచి ప్రారంభమై 12.29 నిమిషాలకు ముగుస్తుంది. అయితే భారత్‌లో సూర్యగ్రహణం కనిపించకపోవడం వల్ల సూతకాలం ఉండకపోవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా ఎలాంటి రాశులవారిపై ప్రభావం పడకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్

సూతక కాలం నియమాలు:
భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదు కాబట్టి ముందు జాగ్రత్తగా పలు నియమాలు పాటించడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
సూతక కాలం ప్రారంభ సమయంలో మీ కుల దైవానికి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
ఈ కాలంలో గర్భిణీ స్త్రీలు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు పదునైన వస్తువులకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
సూతకంలో నిద్రిపోకపోవడం శుభప్రదమ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా మెలకువగా ఉండాలి.

Also Read: Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News