Solar Eclipse 2022: మరి కొద్దిరోజుల్లో సూర్య గ్రహణం సంభవించనుంది. ఇదే ఈ ఏడాదిలో ఆఖరి సూర్య గ్రహణం కానుంది. సూర్య గ్రహణం ప్రభావం దీపావళి, గోవర్ధన పూజపై పడుతుందా లేదా అనేది ప్రధానంగా విన్పిస్తున్న ప్రశ్న..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతియేటా కార్తీకమాసం కృష్ణపక్షంలోని అమావాస్య తిధి నాడు దీపావళి పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 24న దీపావళి పండుగ ఉంది. మరో ముఖ్య విశేషమేమంటే దీపావళి మరుసటి రోజు అంటే అక్టోబర్ 25వ తేదీన ఈ ఏడాదిలో చివరి సూర్య గ్రహణం ఏర్పడనుంది. అదే రోజు గోవర్ధన పూజ కూడా ఉంది. మరి ఈ క్రమంలో సూర్య గ్రహణం ప్రభావం దీపావళి, గోవర్ధన పూజలపై ఏ మేరకు ఉంటుందో తెలుసుకుందాం..


సూర్య గ్రహణం ఎప్పుడు, ఏ సమయంలో


హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం దీపావళి మరుసటి రోజున అంటే అక్టోబర్ 25వ తేదీన ఉంది. సూర్య గ్రహణం అక్టోబర్ 25 మద్యాహ్నం 2 గంటల 29 నిమిషాలకు ప్రారంభమై..రాత్రి 2 గంటల 30 నిమిషాలకు పూర్తవుతుంది. ఈ క్రమంలో 12 గంటల వరకూ సూతక కాలముంటుంది. 


దీపావళి, గోవర్ధన పూజలపై ప్రభావం


సూర్య గ్రహణం ఏర్పడిన తరువాత పూర్తయ్యేవరకూ సూతక కాలంగా భావిస్తారు. ఈ సందర్భంగా పూజాది కార్యక్రమాలు చేయరు. అయితే దీపావళి నాడు సూర్య గ్రహణం ఏర్పడుతోంది. గోవర్ధన పూజ రోజున పూర్తవుతుంది. అయితే సూర్య గ్రహణం ప్రభావం దీపావళి, గోవర్ధన పూజలపై పడటం లేదు. కారణం ఈసారి సూర్య గ్రహణం ఇండియాలో కన్పించకపోవడమే. 


సూతక కాలంలో చేయకూడని పనులు


ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం అక్టోబర్ 25న ఏర్పడనుంది. ఇండియాలో ఈ సూర్య గ్రహణం కన్పించదు. అందుకే ఆ ప్రభావం పడటం లేదు. సాధారణంగా సూర్య గ్రహం ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకూ ఉండే కాలాన్ని సూతక కాలంగాభావించి చాలా పనులు చేయకూడదంటారు. 


2. సూర్య గ్రహణం ప్రారంభానికి ముందే ఇంట్లో ఉన్న అన్ని రకాల ఆహార పదార్ధాల్లో తులసి ఆకులు వేయాలి.


3. గ్రహణం సందర్భంగా మందిరంలో పూజలు చేయరు. దీనికి బదులుగా ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఉండాలి.


4. సూర్య గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీ ఇంట్లోంచి బయటకు రాకూడదు. 


Also read: Shani Mahadasha Remedy: శని మహాదశతో 19 సంవత్సరాలు కష్టాలే.. ఈ పరిహారం చేస్తే పట్టిందల్లా బంగారమే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok