Som Pradosh Vrat 2023: ప్రదోష వ్రతం చేస్తే జీవితం మొత్తం ఆనందమే, లాభాలతో పాటు..డబ్బే, డబ్బు!
Som Pradosh Vrat 2023: ప్రదోష వ్రతంలో భాగంగా ఇలా శివ, పార్వతులకు పూజా కార్యక్రమాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే పూజలో భాగంగా ఈ నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Som Pradosh Vrat 2023: హిందూ సంప్రదాయంలో ప్రదోష వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ప్రదోష వ్రతం ప్రతి నెలలో రెండుసార్లు ఆచరిస్తారు. కృష్ణ పక్షంలో ఒకటి, శుక్ల పక్షంలో ఒకటి.. ఇలా ప్రతి నెలలో రెండు సార్లు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఒక సంవత్సరంలో మొత్తం 24 ప్రదోష వ్రతాలు ఉంటాయి. కాబట్టి ఈ క్రమంలో ఉపవాసాలు పాటించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ప్రస్తుతం వైశాఖ మాసం కొనసాగుతోంది. వైశాఖ మాసం కృష్ణ పక్షమి ఏప్రిల్ 17వ తేదీ సోమవారం (ఈ రోజు)న ప్రదోష వ్రతం వచ్చింది. అయితే ఈ రోజు శంకర, పార్వతులను భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసాలు పాటిస్తే చాలా రకాల లాభాలు కలుగుతాయి. అయితే ఈ పూజ క్రమంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శుభ ప్రారంభం సమయాలు:
వైశాఖం కృష్ణ త్రయోదశి ప్రారంభం: 03:46 సాయంత్రం.
వైశాఖం కృష్ణ త్రయోదశి ముగింపు సమయం: 01:27 సాయంత్రం.
ప్రదోష కాలం: 06:48 సాయంత్రం, నుంచి 09:01 వరకు..
ప్రదోష వ్రతంలోని..ప్రదోష కాలంలోనే పూజలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఈ కాలం సూర్యాస్తమయానికి 45 నిమిషాల ముందు సాయంత్రం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో శివుడిని పూజించడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Also Read: Amarnath Yatra 2023: జూలై 1 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం, మీరు వెళ్లాలనుకుంటే ఇవి తప్పని సరి!
ప్రదోష వ్రత ప్రాముఖ్యత:
ప్రదోష వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
ప్రదోష వ్రతం ఆచరించడం వల్ల సంతాన సుఖం లభిస్తుంది.
అంతేకాకుండా పిల్లల పక్షం కూడా లాభిస్తుంది.
ఈ క్రమంలో శివుడి అనుగ్రహం కూడా లభించే అవకాశాలున్నాయి.
ప్రదోష శీఘ్ర పూజా విధానం:
ఉదయాన్నే 6 గంటలకు లేచి స్నానం చేయాల్సి ఉంటుంది.
స్నానం చేసిన తర్వాత పట్టు వస్త్రాలను ధరించాలి.
దేవత మూర్తుల ముందు పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.
గంగాజలంతో శివుడికి అభిషేకం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి.
పూజా కార్యక్రమంలో భాగంగా తప్పకుండా పూలతో పాటు, నైవేద్యాలు కూడా సమర్పించాలి.
ఈ క్రమంలో భగవంతుని ధ్యానం కూడా చేయాలి.
Also Read: Amarnath Yatra 2023: జూలై 1 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం, మీరు వెళ్లాలనుకుంటే ఇవి తప్పని సరి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook