Amarnath Yatra 2023 Registration: అమర్‌నాథ్ యాత్ర జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన మొత్తం వివరాలను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. 62 రోజుల పాటు కొనసాగే యాత్రలో లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశాలున్నాయని ప్రభుత్వం పేర్కొంది. అమర్‌నాథ్ యాత్ర చేసేవారి కోసం జమ్మూకశ్మీర్‌ప్రభుత్వం ఏప్రిల్ 17 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించనుంది. జమ్మూకశ్మీర్ భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం సమీక్షించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లా, జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో భక్తుల భద్రత, రిజిస్ట్రేషన్, హెలికాప్టర్ సేవలు, సర్వీస్ ప్రొవైడర్లు, క్యాంపులు బీమా రక్షణతో సహా పలు అంశాలపై అధికారులు సమీక్షించారు. అంతేకాకుండా ఈ యాత్రలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించింది.
రిజిస్ట్రేషన్ తేదీల వివరాలు:
హిందువులకు ఎంతో పవిత్రమైన పవిత్ర అమర్‌నాథ్ తీర్థయాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ తేదీలను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. ఎంత మంది భక్తులు వచ్చిన వారికి అవసరమైన వసతి సౌకర్యలకు ఆటకం కలగకుండా చూస్తామన్నారు. అంతేకాకుండా భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యుత్తమ వైద్య సదుపాయాలను కూడా అదించబోతున్నట్లు తెలిపారు.
Also Read: Samantha Shaakuntalam : శాకుంతలం పరిస్థితి ఇంతలా దిగజారిందా?.. ఇదే నిదర్శనం
అమర్‌నాథ్ యాత్రలో భాగంగా పాదయాత్ర చేసేవారికి ముందే టెలికాం సేవలు అందుబాటులో తీసుకువస్తున్నమన్నారు. 62 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగే అమర్‌నాథ్ యాత్ర ఈ ఏడాది జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31న ముగుస్తుంది. దీని కోసం లెఫ్టినెంట్ గవర్నర్ అధికారులకు అన్ని రకాల ఆదేశాలు జారీ చేశారు.
పహల్గాం, బల్తాల్ నుండి యాత్ర ప్రారంభం:
పహల్గాం ట్రాక్ మీదిగా గందర్‌బల్ జిల్లాలోని బల్తాల్ నుంచి యాత్ర ప్రారంభం ప్రారంభం కానుంది. అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఉదయం, సాయంత్రం హారతిని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అంతేకాకుండా ప్రయాణానికి సంబంధించిన వివరాలు, వాతావరణ వివరాలు అధికారిక వెబ్ సైట్‌లో, అమర్‌నాథ్ యాత్ర యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి వచ్చింది.
Also Read: Samantha Shaakuntalam : శాకుంతలం పరిస్థితి ఇంతలా దిగజారిందా?.. ఇదే నిదర్శనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook