హిందూమతంలో ప్రతి పండుగ, ప్రతి ప్రత్యేక రోజుకు ఓ ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. అదే విధంగా అమావాస్యకు కూడా ప్రత్యేకత ఉంది. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలా అమావాస్య వచ్చిన..సోమవతి అమావాస్య మాత్రం రెండుసార్లు వస్తుంటుంది. ఆ వివారాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం సోమవతి అమావాస్య అనేది ఒక ఏడాదిలో 2-3 సార్లు వస్తుంటుంది. ఈ రోజున రావి చెట్టుకు పూజ చేస్తే చాలా మంచిదని నమ్మకం. సోమవతి అమావాస్య రోజున పూర్వీకులకు తర్పణమిస్తే..వారి ఆత్మ శాంతిస్తుందని ఓ ప్రగాఢ నమ్మకం. దాంతోపాటు వివాహిత మహిళలకు ఈరోజు చాలా ముఖ్యమైంది. ఈ రోజున వ్రతం ఆచరిస్తారు. మహిళలకు సోమవతి అమావాస్య ఎందుకు ప్రత్యేకమో తెలుసుకుందాం..


వివాహిత మహిళలు సోమవతి అమావాస్య వ్రతం ఎందుకు ఆచరిస్తారు


సోమవతి అమావాస్య నాడు వివాహిత మహిళలు వ్రతం ఆచరిస్తే..ఆమె సౌభాగ్యం నూరేళ్లు ఉంటుందని లేదా భర్త ఆయువు ఎక్కువకాలం ఉంటుందని నమ్మకం. ఈ రోజున వివాహిత సౌభాగ్యవతులైన మహిళలు వ్రతం ఆచరించి..రావిచెట్టుకి పాలు, పూలు, అక్షింతలు, చందనం, అగరబత్తితో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తరువాత నలువైపులా 108 దారాలు చుట్టి పరిక్రమ చేస్తారు. శవుడి దీర్ఘాయుష్ఖువు కోరతారు. 


సోమవతి అమావాస్య నేపధ్యం


సోమవతి అమావాస్యకు సంబంధించి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇందులో ఒకటి ప్రేద బ్రాహ్మణుడి కుటుంబం కధ. అతనికి సర్వాంగ సంపన్నురాలైన ప్రతిభావంతురాలైన ఓ అమ్మాయి ఉంది. పెళ్లీడు రాగానే తగిన వరుడి కోసం అణ్వేషిస్తుంటాడు ఆ బ్రాహ్మణుడు. చాలామంది వరులు లభించినా..బ్రాహ్మణుడు పేదవాడు కావడంతో పెళ్లి వరకూ రావడం లేదగు. ఓ రోజున ఆ బ్రాహ్మణుడి ఇంటికి ఓ సాధువు వస్తాడు. ఆ అమ్మాయి సేవాభావం చూసి సాధువు చాలా ప్రసన్నుడౌతాడు. దీర్ఘాయుష్షువంటూ ఆశీర్వాదమిస్తాడు. బ్రాహ్మణుడి అడగడంతో ఆ అమ్మాయి చేతిలో పెళ్లి రేఖ లేదంటాడు. మరి దీనికి ఉపాయమేంటని అడినప్పుడు..పొరుగు ఊరిలో సోనా అనే చాకలి కుటుంబం గురించి చెబుతాడు. ఈ అమ్మాయి ఒకవేళ ఆమెకు సేవలు చేసి ఆమె సౌభాగ్యం పొందితే పెళ్లి సాధ్యమౌతుందంటాడు. 


Also read: Venus transit 2023: శుక్ర గోచారం ప్రభావం, మార్చ్ 15 వరకూ ఆ 3 రాశులకు తిరుగే ఉండదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook