Venus transit 2023: శుక్ర గోచారం ప్రభావం, మార్చ్ 15 వరకూ ఆ 3 రాశులకు తిరుగే ఉండదు

Venus transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలకు, నక్షత్రాల రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని గ్రహాల రాశి పరివర్తనం లేదా గోచారం కొన్ని రాశులపై అత్యంత శుభ సూచకంగా ఉంటే..మరి కొన్ని రాశులకు దుర్లభంగా ఉంటుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 20, 2023, 09:01 AM IST
Venus transit 2023: శుక్ర గోచారం ప్రభావం, మార్చ్ 15 వరకూ ఆ 3 రాశులకు తిరుగే ఉండదు

హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్యం చూడకుండా లేదా పంచాంగం చూడకుండా ఏ పని చేయనివాళ్లుంటారు. అందుకే గ్రహాల రాశి పరివర్తనానికి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది. ఎప్పుడు ఏ రాశి దశ తిరుగుతుందనేది ఆ రాశిలో ప్రవేశించి గ్రహ స్థితిని బట్టి ఆధారపడి ఉంటుందంటారు జ్యోతిష్య పండితులు.

జ్యోతిష్యం ప్రకారం ఫిబ్రవరి 15వ తేదీన శుక్రుడు మీనరాశిలో ప్రవేశించాడు. శుక్రుడి మీన రాశి ప్రవేశంతో అప్పటికే ఆ రాశిలో ఉన్న గురుడితో యుతి ఏర్పడింది. మార్చ్ 15 వరకూ 3 రాశులవారిపై పూర్తిగా శుభ ఫలాలు అందనున్నాయి. ఎందుకంటే జ్యోతిష్యంలో ప్రతి గ్రహం ఓ నిర్ణీత సమయంలో నిర్ణీత రాశి ప్రవేశముంటుంది. దీని ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుంది. కొన్ని రాశులపై అనుకూలంగా, కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. శుక్ర గ్రహాన్ని ధనం, విలాసం, ప్రేమ, రొమాన్స్‌కు చిహ్నంగా భావిస్తారు. ఫిబ్రవరి 15 న ఐదు రోజుల క్రితమే శుక్రుడు మీనరాశిలో ప్రవేశించాడు. ఆ రాశిలో సౌభాగ్యం, అదృష్టం ఇచ్చే గురుడు అప్పటికే ఉండటంతో..రెండు గ్రహాలతో యుతి ఏర్పడింది. శుక్ర, గురు గ్రహాల యుతితో 3 రాశులకు విశేషంగా లాభం కలగనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..

శుక్రుడి గోచారంతో అంతులేని ధన సంపదలు

మిథున రాశి

శుక్రుడి గోచారం మిథునరాశివారికి అత్యంత శుభంగా ఉంటుంది. మార్చ్ 15 వరకూ ఈ జాతకం వారికి అంతులేని ధనం లభిస్తుంది. ఈ జాతకం గోచారం కుండలిలో మాలవ్య రాజయోగం ఏర్పడటం వల్ల ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఇష్టమైన చోటికి బదిలీ ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి, ఇంక్రిమెంట్లు ఉంటాయి. వ్యాపారం కూడా బాగుంటుంది. 

కన్యారాశి

కన్యారాశి వారికి శుక్రుడి రాశి పరివర్తనం లభదాయకం కానుంది. జీవితంలో ప్రేమ, రొమాన్స్ పెరుగడంతో,,ఈ జాతకం వారికి జీవిత భాగస్వామితో సంతోషం లభిస్తుంది. జీవిత భాగస్వామికి తన కెరీర్‌పరంగా వృద్ధి ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. పాత కోర్కెలు నెరవేరుతాయి. ధనలాభముంటుంది. ఏదైనా ఖరీదైన వస్తువును పొందడమే కాకుండా వ్యాపారంలో ఊహించని లాభాలు ఆర్జిస్తారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. 

మీనరాశి

శుక్రుడు మీనరాశిలో ప్రవేశించడం వల్ల గురు శుక్ర గ్రహాల యుతి ఏర్పడనుంది. ఫలితంగా శుక్రుడి రాశి పరివర్తనం ప్రభావం ఎక్కువగా మీనరాశిపై ఉండనుంది. యుతి కారణంగా మీనరాశి వారికి విశేషమైన ధనలాభముంటుంది. కెరీర్‌పరంగా, వ్యాపారపరంగా అభివృద్ధి ఉంటుంది. సంతానయోగం కలిగి..దాంపత్య జీవితంలో ప్రేమ పెరుగుతుంది. 

Also read: Guru gochar 2023: గురు మీనరాశి ప్రభావం, ఏప్రిల్ నుంచి ఆ మూడు రాశులకు రాజయోగం, పట్టిందల్లా బంగారమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News