కొత్త ఏడాది ప్రారంభమైపోయింది. ఇంటిని కొత్తగా అలంకరించుకోవల్సిన అవసరముంది. వాస్తుశాస్త్రం నియమాల ప్రకారం ఇంటిని ఎలా అలంకరించుకోవాలనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంట్లో వాస్తుశాస్త్రం ప్రకారం శుభసూచకమైన మొక్కల్ని అమర్చుకుంటే ఏడాది మొత్తం ఇంట్లో అన్నింటా ఆదా ఉంటుంది. ధన సంపదలకు లోపముండదు. అందుకే శుభసూచకమైన మొక్క స్పైడర్ ప్లాంట్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. వాస్తుశాస్త్రంలో స్పైడర్ ప్లాంట్‌కు చాలా ప్రాధాన్యత, మహత్యముంది. ఇంట్లో సరైన ప్రదేశంలో, సరైన దిశలో ఈ మొక్క ఉంటే..పాజిటివ్ పరిణామాలు చోటుచేసుకుంటాయి.


దిశ


వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ఉత్తర, తూర్పు, ఈశాన్యం లేదా నైరుతి దిశలో మొక్కల్ని అమర్చుకుంటే అంతా శుభం జరుగుతుంది. అదే మీ ఆఫీసులో ఉంచాలనుకుంటే టేబుల్‌పై ఉంచడం చాలా మంచిది. అత్యంత శుభసూచకమౌతుంది. స్పైడర్ ప్లాంట్‌ను ఇంట్లో లివింగ్ రూమ్, కిచెన్, బాల్కనీ, స్టడీ రూమ్‌లో ఉంచవచ్చు


అశుభ ఫలాలు


స్పైడర్ ప్లాంట్‌ను పొరపాటున కూడా ఎండనివ్వకూడదు. ఏదైనా కారణంతో ఈ మొక్క ఎండిపోతే..వెంటనే తొలగించి కొత్త మొక్క నాటుకోవాలి. స్పైడర్ ప్లాంట్‌ను ఎప్పుడూ ఇంటి దక్షిణం, పశ్చిమ దిశలో ఉంచకూడదు. ఈ దిశలో స్పైడర్ ప్లాంట్ అమర్చితే అశుభ సూచకమౌతుంది.


ఆరోగ్యం


స్పైడర్ ప్లాంట్ ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనకరం. వాస్తుశాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్ దూరం చేయవచ్చు. ఇంటి నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. చెడు శక్తులు నశిస్తాయి.


Also read: Shukra Gochar: 2023లో ఈ రాశులకు శుక్రుడి ఆశీస్సులు.. వీరికి డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook