Sravana Shivratri 2022: శ్రావణ శివరాత్రి రోజు రుద్రాభిషేకం చేస్తే.. మీ ఇంటి నిండా డబ్బే డబ్బు!
Sravana Shivratri 2022: ఈ రోజు శ్రావణ మాస శివరాత్రి. ఇది సంవత్సరంలోని అన్ని మాస శివరాత్రుల్లో కెల్లా స్పెషల్. ఈ శ్రావణ శివరాత్రి చేయడం వల్ల మీ దుఃఖాలన్నీ తొలగిపోతాయి.
Sravana Shivratri 2022: ఇవాళ అంటే జూలై 26, 2022 మంగళవారం శ్రావణ శివరాత్రి (Sravana Shivratri 2022). అదే విధంగా ఈ రోజే శ్రావణ మాసం రెండో మంగళగౌరీవ్రతం (Sravana Mangala Gowri Vratham 2022) కూడా. చాలా సంవత్సరాల తర్వాత ఈ రెండు పండుగలు ఒకేరోజు రావడంతో ఈ రోజుకి ప్రాధాన్యత పెరిగింది. ఇవాళ పార్వతీపరమేశ్వరులను పూజించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు శివుడికి రుద్రాభిషేకం (Rudrabhishekam) చేయడం వల్ల లైఫ్ లోని అన్ని దుఃఖాలు తొలగిపోతాయి. అంతేకాకుండా గ్రహదోషాల నుండి విముక్తి పొందుతారు. పార్వతీమాత అనుగ్రహంతో మీ వైవాహిక జీవితం సూపర్ గా ఉంటుంది. మంగళగౌరీ వ్రతాన్ని శ్రావణ మాసంలోని అన్ని మంగళవారాల్లో పాటిస్తారు.
రుద్రాభిషేకం చేసే విధానం
శ్రావణ శివరాత్రి రోజున ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. తెల్లని దుస్తులు ధరిస్తే మంచిది. మీరు ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు... ఉత్తర దిశలో శివలింగాన్ని ప్రతిష్టించండి. అలాగే మీ ముఖం తూర్పు వైపు ఉండే విధంగా చూసుకోండి. తర్వాత ఒక ఇత్తడి చెంబుతో గంగాజలాన్ని తీసుకుని శివలింగానికి అభిషేకించండి. దీని తరువాత శివలింగానికి తెల్ల చందనం పూత పూయండి. ఆ తర్వాత పాలు, పెరుగు, పంచదార, తేనె, నెయ్యి పంచామృతాలతో స్వామికి అభిషేకం చేయాలి. అనంతరం శివుడికి బిల్వపత్రాలు, ఆకులు, దాతురా, పరిమళం, పండ్లు, స్వీట్లు సమర్పించండి. ఈ సమయంలో మహామృత్యుంజయ మంత్రం లేదా ఓం నమః శివాయ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండండి. తర్వాత ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ధూపం వేసి.. చివరగా హారతి ఇవ్వండి. మీ ఇంట్లో ప్రతి మూలలోను అభిషేక జలాన్ని చల్లుకోండి. ఇది ఇంటి ప్రతికూలతను తొలగిస్తుంది.
Also Read: Mangala Gowri vratham 2022: ఇవాళే శ్రావణ రెండో మంగళ గౌరీ వ్రతం, శుభముహూర్తం, పూజా విధానం తెలుసుకోండి
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook