Sravanam Masam 2022: శ్రావణంలో ఈ రంగు దుస్తులు ధరించి శివుడిని పూజిస్తే... అంతులేని సంపద మీ సొంతం!
Sravanam 2022: శ్రావణ మాసం శివారాధన చేస్తారు. ఈ మాసంలో శివుడికి ఇష్టమైన దుస్తులు ధరించి పూజలు చేయడం వల్ల వారికి ఎలాంటి లోటు ఉండదు.
Sravana Masam 2022: హిందువులు శ్రావణ మాసాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాసం పరమశివుడికి (Lord Shiva) ఎంతో ప్రీతిపాత్రమైనది. ఇవాళ్టి నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ నెలలో శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఆస్ట్రాలజీ అనేక పరిహారాలు చెప్పబడ్డాయి. మహాదేవుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. నీరు అర్ఘ్యం సమర్పించడం ద్వారా కూడా శివుడి ఆశీస్సులు పొందవచ్చు. మహాదేవుడికి ఇష్టమైన దుస్తులు ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
ఏ రంగు దుస్తులు ధరించాలి?
శివునికి ఆకుపచ్చ రంగు అత్యంత ప్రీతికరమైనది. కాబట్టి మీరు శ్రావణ మాసంలో పరమేశ్వరుడిని పూజించినప్పుడల్లా ఖచ్చితంగా ఆకుపచ్చని దుస్తులను ధరించండి. శివరాత్రి రోజున కూడా ఆకుపచ్చ రంగులను ధరించడం ఉత్తమంగా భావిస్తారు.
ఏ రంగు దుస్తులు ధరించకూడదు?
భోలేనాథ్‌ను పూజించేటప్పుడు ఆయనకు ఇష్టమైన రంగు దుస్తులు ధరించడం శుభ ఫలితాలను ఇస్తుంది. అయితే శివుడికి ఇష్టం లేని రంగు దుస్తులు ధరించడం వల్ల ఆయనకు కోపం తెప్పిస్తుంది. కాబట్టి శివ పూజ చేసేటప్పుడు నల్లని దుస్తులను ధరించకండి. శివారాధన సమయంలో పురుషులు ధోతీ ధరించడం మంచిది.
మహామృత్యుంజయ మంత్రం
మహాదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రావమ మాసంలో 108 సార్లు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం మంచిది. శ్రావణ మాసంలో శివుని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
Also Read: Chaturmas 2022 : చాతుర్మాసంలో శివుడి అనుగ్రహం పొందాలంటే.. ఇలా చేయండి!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజ
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
కీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.