Sri Rama Navami 2022: శ్రీరామ నవమి పూజా ముహూర్తం, విధివిధానాలు ఏంటో తెలుసా?
Sri Rama Navami 2022: చైత్ర నవరాత్రులు 9 రోజుల ఉత్సవాల తర్వాత ఆదివారం (ఏప్రిల్ 10) శ్రీరామ నవమి ఉత్సవాలు జరుపుకొనేందుకు భక్తులు ఎదురు చూస్తున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం శ్రీరామనవమి రోజున చేయాల్సిన పూజా విధివిధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Sri Rama Navami 2022: హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రీరామ నవమి పండుగ ఈ ఏడాది ఏప్రిల్ 10 రానుంది. చైత్ర నవరాత్రుల తర్వాత హిందువులు జరుపుకొనే పండుగ ఇది. శ్రీరామనవమి రోజున భక్తులు చేయాల్సిన పూజా విధివిధానాలతో పాటు రామనవమి ముహూర్తం గురించి తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం శ్రీరాముడు అయోధ్యలో జన్మించారు. ఆయన పుట్టినరోజున ప్రతిఏడాది ఈ ఉత్సవాలు జరుగుతుంటాయి. ఆయన జన్మస్థలమైన అయోధ్యలో ఉత్సవాలు మిన్నంటుతాయి. రాముడు చైత్ర మాస శుద్ధ నవమి నాడు మధ్యాహ్న కాలంలో జన్మించారు. మధ్యాహ్న కాలం అంటే హిందూ ఆచారం ప్రకారం రోజుకు మధ్యలో అని అర్థం. శ్రీరామ నవమి రోజును హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు.
ఈ ఏడాది శ్రీరామ నవమి ముహూర్తం..
శ్రీరామ నవమి మధ్యాహ్న ముహూర్తం - ఉదయం 11:07 నుంచి మధ్యాహ్నం 01:40 వరకు
ముహూర్త కాల వ్యవధి - 02 గంటలు 32 నిమిషాలు
శ్రీరామ నవమి మధ్యాహ్న క్షణం - 12:23 PM
నవమి తిథి ప్రారంభం - 2022 ఏప్రిల్ 10.. తెల్లవారుజామున 01:23 గంటలకు ప్రారంభం
నవమి తిథి ముగుస్తుంది - 2022 ఏప్రిల్ 11న తెల్లవారుజామున 03:15 గంటలకు ముగుస్తుంది.
శ్రీరామనవమి పూజ విధివిధానాలు..
శ్రీరామనవమి పర్వదినం నాడు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ఆచరించాలి. ఇంటితో పాటు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరంలో రాముని విగ్రహం లేదా ఫొటో ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత దేవుడికి ప్రసాదం సిద్ధం చేయాలి. పూజా మందిరాన్ని పూలతో అలంకరించి.. ధూప, దీప, నైవేద్యాలను సమర్పించాలి.
పూజ చేసే క్రమంలో రామాయణం లేదా ఇతర పవిత్ర గ్రంధాలను చదివి.. ముహూర్త సమయంలో సీతా సమేత శ్రీరామునికి హారతి ఇవ్వాలి. హిందూ ఆచారం ప్రకారం.. శ్రీరామ నవమి రోజున రాముడ్ని పూజించడం వల్ల తమ పాపాలకు పరిహరించుకొని.. ముక్తి పొందవచ్చని భక్తుల నమ్మకం.
ఉపవాసాన్ని ఎలా చేయోలా తెలుసుకోండి..
1) శ్రీరామ నవమికి ముందు అర్ధరాత్రి నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులు ఉపవాసం ఉంటారు. కొందరు 24 గంటల పాటు కూడా ఉపవాసం ఉంటారు.
2) 12 గంటల పాటు ఉపవాసం చేసేవారు పూజ పూర్తైన తర్వాత ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి.
3) అందులో పండ్లు, పండ్ల రసాలు, పాలు వంటివి మాత్రమే తీసుకోవాలి. ఉపవాసం ఉండేవాళ్లు వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ, పసుపు లేకుండా బంగాళదుంపలతో కూడిన భోజనాన్ని తినొచ్చు. అంటే ఉపవాసం ఉండేవారు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
Also Read: Lakshmi Panchami: లక్ష్మీ పంచమి... శ్రీ మహాలక్ష్మిని ఇలా పూజిస్తే శుభం కలుగుతుంది...
Also Read: Vastu Shastra: దేవుళ్లకు పూజ చేసేందుకు వాడాల్సిన పూలు ఏవి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook