Lakshmi Panchami: చైత్ర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే పంచమి తిథిని లక్ష్మీ పంచమిగా జరుపుకుంటారు. లక్ష్మీ పంచమి శ్రీ మహాలక్ష్మీ దేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. శ్రీ మహా విష్ణువు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీ దేవి భూలోకానికి వచ్చిన రోజుగా దీన్ని చెబుతారు. లక్ష్మీ దేవి అనుగ్రహంతో ఇంట్లో ఐశ్వర్యం, శ్రేయస్సు ఆనందం విలసిల్లుతుంది. ఈ ఏడాది లక్ష్మీ పంచమి ఏప్రిల్ 6న రానుంది. ఈ నేపథ్యంలో లక్ష్మీదేవిని ఎలా పూజించాలో తెలుసుకుందాం..
లక్ష్మీ పంచమి పూజా విధానం :
1) లక్ష్మీ పంచమి రోజున ఇంటిల్లిపాదీ తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. లక్ష్మీ దేవి పూజకు ముందు ఎర్రటి కుంకుమతో ఇంటి గోడలపై పూర్ణ కుంభం, లక్ష్మీ దేవి పాదాల గుర్తు వేయాలి. తద్వారా లక్ష్మీ దేవి ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతారు. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి.
2) లక్ష్మీ దేవి చిత్ర పటం వద్ద ఆవు నెయ్యితో, తామర వత్తులతో ఆరు దీపాలు వెలిగించి దీపారాధన చేయాలి. లక్ష్మీ దేవి మంత్రాన్ని పటించాలి.
3) కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమతోనే పూజ చేయాలి. పూజ సమయంలో అమ్మవారికి తృణధాన్యాలు, పసుపు, బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. కుదిరితే పానకం, దానిమ్మ గింజలు, పప్పు నైవేద్యంగా సమర్పిస్తే మరీ మంచిది.
4) పూజ సందర్భంగా మహా విష్ణువుకు పసుపు వస్త్రాలు సమర్పించాలి.
5) రూపాయి బిళ్లలతో లక్ష్మీ దేవిని పూజిస్తే శుభం కలుగుతుంది. పూజ అనంతరం ఆ రూపాయి బిళ్లలను ఎర్రటి వస్త్రంలో చుట్టి బీరువాలో దాచాలి. తద్వారా సంపద చేకూరుతుంది.
6) లక్ష్మీ పంచమి రోజున గుర్రం కనిపిస్తే ప్రదక్షిణలు చేయాలి. నాగ దేవతకు పాలు పోసి పూజిస్తే మంచిది.
Also Read: Petrol Price Today: భారీగా పెరిగిన ఇంధన ధరలు.. లీటర్ పెట్రోల్ ధర రూ.120!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook