Sri Rama Navami 2024 Special: శ్రీరామ చంద్రుడు అప్పటి వాళ్లే కాదు ఇప్పటి వాళ్లు కూడా  గొప్పవాడని ఒప్పుకుంటారు. రాముడిది ఒకే మాట.. ఒకే బాణం.. ఒకే భార్య.. విధానం. ప్రెజెంట్ సమాజం వెళ్తున్న మార్గాన్ని అనుసరించి చెబితే.. రాముడి వ్యక్తిత్త్వం మనందరికీ అవసరం. శ్రీ రాముడి మీద కొంత మంది అనేక ఆరోపణలు చేస్తుంటారు. ఆయన నాతిచరామీ అనే పెళ్లినాటి ప్రమాణాన్ని పట్టించుకోలేదని అంటుంటారు. ఇవాళ పెళ్లి చేసుకుని రేపు విడాకులిచ్చేసే కాలంలో వున్నాము. ఇంకా ఎన్నో అంటారు. అయితే రాముడు ఎంతటి కష్టతరమైన సమయంలోనూ భార్యను ఒదులుకోలేదు. సీతను అగ్నిప్రవేశం చేయించాడంటే అది కేవలం ఆమె మీదున్న నమ్మకం. మహిళలను వేధించడానికిదో కుట్ర అనేవారున్నారు. కానీ రాముడికి సీత మీదున్న నమ్మకానికది నిదర్శనం. భార్య పట్ల అచంచల విశ్వాసం ఉండబట్టే ఆమె అగ్నిప్రవేశం చేస్తున్నా చలించలేదు. సీత తిరిగి తన వద్దకు క్షేమంగా వస్తుందని ఎదురుచూశాడు రాముడు. సీత అశోకవనంలో ఉండగా, ఆమె ధ్యానంలోనే గడిపాడు. ఆమె దూరమైనపుడు పరస్త్రీల గురించి కలలోనైనా తలవక పోవడం రాముడి సిసలైన వ్యక్తిత్వానికి నిదర్శనం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పరస్త్రీలను విలాస వస్తువుగా చూస్తూ.. అత్యాచారాలకు తెగబడుతున్న ఈ కాలంలో.. యువతకు రాముడెంతైనా ఆదర్శ పురుషుడు అని చెప్పాలి. రాముడిలో ఇంకో గొప్పదనం కూడా వుంది. తనదైన వ్యక్తిత్త్వంతో ఆయన తన చుట్టుపక్కల వుండే వారికి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చాడు. తన భార్య అయినందుకు సీత ఆదర్శ వనితగా పేరు సాధించింది. లక్ష్మణుడు గొప్ప సోదరుడిగా కీర్తి గడించాడు. భరతుడు తమ్ముళ్లకే తమ్ముడిగా పేరు సాధించాడు. స్నేహితుడుగా.. ఆంజనేయుడు రాముడి మించి పూజించబడుతున్నాడు.


ఒకరా ఇద్దరా రాముడు తన అరణ్యవాసానికి కారకులైనప్పటికీ కైకేయి, మందరలపై ఎలాంటి ఆగ్రహం చూపలేదు. వారిని గౌరవ భావంతోనే చూశాడు. శూర్పణఖ వంటి రాక్షస స్త్రీలను క్షమించి వదిలేశాడు. సీత భద్రత విషయమై ఆలోచించి తన సోదరుడైన లక్ష్మణుడిని ఆమె అంగరక్షకుడిగా నియమించాడు. కేవలం సీత కోసమే రావణ సంహారం చేశాడు. రామాయణ ఇతివృత్తాన్ని, అంతరార్థాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తే యువతకు ఇలాంటి ఎన్నో విషయాలు తెలుస్తాయి.


రాముడికి ఇన్నేసి గుణగణాలున్నాయి కనుకనే ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమి నాడు రామనవమి జరుపుకుంటారు. రామ జననం, సీతారామ కల్యాణం, రామావతారం పరిసమాప్తి.. జరిగిన రోజునే నవమి వేడుకల్ని జరుపుకోవడం ఆనవాయితీ. రాముడు కేవలం ఏ ఒకరికో ఇద్దరికో అవసరమయ్యే వ్యక్తిత్త్వం కాదు. అన్ని వేళలా అందరికీ ఆదర్శప్రాయం. అందుకే  శ్రీరామనవమి దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా  సామూహికంగా నిర్వహిస్తుంటారు.


భారతదేశంలో బడి లేని ఊరుందో లేదో తెలియదు కానీ, రాముడి గుడి లేని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు. శ్రీరామనవమి వచ్చిందంటే చాలు చలువ పందిళ్లు వేసి, బాజా భజంత్రీలు వాయించి.. జోరుగా సీతారాముల కళ్యాణం చేస్తారు. ఇందులో ప్రాకృతిక విశేషాలు కూడా దాగి వున్నాయి. మాములుగా తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలను జరుపుతారు. అందుకు కారణం లేక పోలేదు. రామనవమి వసంత ఋతువు ఎండా కాలంలో వస్తుంది. వేసవి కారణంగా వాతావరణంలో మార్పు తప్పదు. ఫలితంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశముంది. వీటిని పారదోలేందుకు వీధుల్లో పసుపునీళ్లు చల్లుతారు. ఇక నవమి వేడుకల్లో నైవేద్యంగా సమర్పించే పానకం, వడపప్పు వంటి ప్రసాదాలు మనలో వేసవి తాపాన్ని చల్లార్చి, రోగ నిరోధక శక్తి పెంచుతాయి.


Read More: Happy Sri Rama Navami 2024: మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ నవమి ప్రత్యేక శుభాకాంక్షలు, కోట్స్ ఇలా పంపండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter