Sri Rama Navami 2023 date: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి ఒకటి. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడి జన్మదినాన్ని పురష్కరించుకుని ఈ పండుగను జరుపుకుంటారు. విష్ణువు యెుక్క ఏడో అవతారంగా శ్రీరాముడిని భావిస్తారు. శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకున్నదని, సీతారాముల కళ్యాణం జరిగినది ఇదే రోజున నమ్మకం. అందుకే కొన్ని ప్రాంతాల్లో శ్రీరామనవమి రోజున శ్రీరాముడి జన్మదినం జరుపుకుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని జరుపుతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీరామనవమి పండుగను మన తెలుగు లోగిళ్లలో చాలా వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణాలో గల భద్రాచలంలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని కన్నులపండువగా జరుపుకుంటారు. ఈ ఫెస్టివల్ ను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ లో వసంతోత్సవం పేరిట తొమ్మిది రోజులు పాటు వేడుకలను నిర్వహిస్తారు. ఈ పండుగ రోజున బెల్లం, మిరియాలు కలిపి తయారు చేసే పానకాన్ని పంచిపెడతారు. ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న పండుగను ఈ సంవత్సరం మార్చి 30, 2023 నాడు జరుపుకోనున్నారు. ఈరోజున ఉపవాసం ఉండటం, పారాయణం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ ఫెస్టివల్ ను వైభవంగా జరుపుకునేందుకు దేశం మెుత్తం రెడీ అవుతోంది.


Also Read: Sri Rama Navami 2023: శ్రీరామనవమి రోజున ఈ రాశులకు మహార్దశ.. ఇందులో మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook