Christmas: పవిత్రమైన పండుగ క్రిస్మస్ వెనుక ఉన్న అసలు కథ ఇదే..
Christmas 2023: ఏసుక్రీస్తు.. జనాల మధ్య తిరిగి జనాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన భగవంతుడు. క్రైస్తవులు పూజించే ఏసుక్రీస్తు.. జన్మదిన పండుగని ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ గా జరుపుకుంటారు. మరి ఈరోజు విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.
Christmas Celebrations: క్రిస్మస్ ..ఈరోజు పలు దేశాలలో సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఆ రోజు క్రైస్తవులు తమ దేవుడిని ప్రార్థించి లోక రక్షణ చేయమని వేడుకుంటూ సంబరాలను మొదలుపెడతారు. ఇంతకీ ఈ పండుగ ఎలా వచ్చింది దీని ప్రత్యేకత ఏమిటి తెలుసుకుందాం.
మేరీకి దేవదూత సాక్షాత్కారం:
అప్పటి రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో నివసించే మేరీ జోసెఫ్ అని యువతికి పెళ్లి కుదిరింది. అయితే ఒక రోజు ఆమె స్వప్నంలో గాబ్రియల్ అనే దేవదూత దర్శనమిచ్చి.. ఆమె కడుపులో దేవుడి బిడ్డ పుడతాడని.. కన్యగానే ఆమె గర్భం దాల్చి ఆ బిడ్డకు జన్మనిస్తుంది అని.. అతనికి ఏసు అని పేరు పెట్టమని చెబుతుంది. ఏసు అంటే రక్షకుడు అని అర్థమట.
మేరీ గర్భం:
దేవదూత కలలో చెప్పిన విధంగానే మేరీ కన్యగానే గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన జోసెఫ్ మొదట ఆమెను పెళ్లి చేసుకోకూడదు అనుకుంటాడు. అయితే అతనికి ఒక రోజు రాత్రి కలలో దేవదూత తిరిగి కనిపించి.. మేరీ కడుపులో ఉన్నది దేవుడి బిడ్డ.. అతను తను నమ్మిన ప్రజల పాపాలను ప్రక్షాళన చేసి వాళ్ళని రక్షించడానికి అవతారం ఎత్తుతున్నాడు .కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీవు మేరీని విడిచి పెట్టవద్దు.. అని చెప్పి మాయమవుతుంది.
పశువుల పాకలో జననం:
కడుపుతో ఉన్న మేరీని తీసుకొని జోసెఫ్ తన స్వగ్రామం బెత్లేహేమ్‌కు బయలుదేరుతాడు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఉండడానికి ఎక్కడా వసతి దొరకదు. చివరికి ఒక సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి ఆశ్రయం కల్పిస్తాడు. అక్కడే మేరీ ఏసుకు జన్మనిచ్చింది. 2000 సంవత్సరాల క్రితం డిసెంబర్ 24వ తేదీన అర్ధరాత్రి 12 గంటల తర్వాత జీసస్ జననం జరగడంతో డిసెంబర్ 25న క్రిస్మస్ గా జరుపుకుంటారు.
క్రిస్మస్ ఫెస్టివల్:
ఈరోజు క్రైస్తవులు తమ ఇళ్లను చర్చలను అందంగా అలంకరించి.. ప్రభువు జననాన్ని దారి చూపిన పెద్ద నక్షత్రానికి గుర్తుగా తమ ఇంటి ముందు ఒక పెద్ద నక్షత్రాన్ని వేలాడదీస్తారు. అలాగే ఇంట్లో క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా ఈ పండుగను జరుపుకుంటారు.
Also read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook