Surya Guru yuti in taurus 2024: గ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుడు నెలకొకసారి తన కదలికలను మారుస్తాడు. వచ్చే నెలలో భాస్కరుడు కూడా తన రాశిని మార్చబోతున్నాడు. మే 14న సూర్యుడు మేషరాశిని విడిచిపెట్టి వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. అదే రాశిలో జూన్ 14 వరకు ఉంటాడు ఆదిత్యుడు. అయితే అప్పటికే వృషభరాశిలో బృహస్పతి కూర్చుని ఉంటాడు. దీంతో సూర్యుడు, గురుడు కలయిక ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహరాశి 
సింహరాశి వారికి బృహస్పతి మరియు సూర్యుని కలయిక లాభదాయకంగా ఉంటుంది. మీరు కొత్త పని లేదా వ్యాపారం ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. మీరు అనారోగ్యం నుండి బయటపడే అవకాశం ఉంది. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.  మీరు ఫ్యామిలీ అండ్ స్నేహితులతో విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. 
కుంభ రాశి
సూర్యుడు సంచారం కుంభరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగం సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభాలను పొందుతారు. మీకు కోరుకున్న జాబ్ వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీరు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. మీ పేదరికం పోతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. 
మేషరాశి
సూర్యుడు రాశి మార్పు మేషరాశి వ్యక్తులు అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని ఇవ్వబోతుంది. పెండింగ్ లో ఉన్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ ఆదాయం వృద్ధి చెందుతుంది. విదేశాలకు వెళ్లాలనే మీ డ్రీమ్ నెరవేరుతోంది. ఉద్యోగస్తులకు జీతం పెరగడంతోపాటు పదోన్నతి కూడా లభిస్తుంది. భార్యభర్తల మధ్య విభేదాలు తొలగిపోతాయి. 


Also Read: Jupiter transit 2024: ఏప్రిల్ 29న బృహస్పతి రాశి మార్పు.. ఈ 3 రాశులవారు ధనవంతులు అవ్వడం పక్కా..


Also Read: Astrology - Raja Yoga: 12 యేళ్ల తర్వాత గజలక్ష్మీ యోగము.. ఈ రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter