Rajyogam: బుధాదిత్య రాజయోగంతో ఈ రాశులకు కావాల్సినంత డబ్బు.. మీ రాశి ఉందా?
Budhaditya Rajyog Benefits: రెండు గ్రహాల కలయికను యుతి అంటారు. వచ్చే నెలలో సూర్యుడు, బుధుడు కలయిక వల్ల పవిత్రమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతుంది. ఇది మూడు రాశులవారికి కలిసి రానుంది.
Sun and Mercury Conjunction 2023: అక్టోబర్ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాల గమనంలో పెను మార్పు రాబోతుంది. అక్టోబరు 11న సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించి బుధుడుతో కలవబోతున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల పవిత్రమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల మూడు రాశులవారు లాభం పొందబోతున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
తులారాశి
బుధాదిత్య రాజయోగం తుల రాశి వారికి ఆర్థికంగా లాభాలను ఇస్తుంది. మీ సంపద రెట్టింపు అవుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. పెట్టుబడులు మీకు అనుకూలిస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలను పొందుతారు. మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మిమ్మల్ని అనారోగ్యం దరిచేరదు.
సింహరాశి
సింహ రాశి వారికి బుధాదిత్య రాజయోగం అనుకూలంగా ఉంటుంది. మీరు మానసిక ఒత్తిడి నుండి బయటపడే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఊహించని లాభాలను పొందుతారు. మీరు ఖర్చులను అదుపులో ఉంచుకోండి. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.
మేషరాశి
సూర్యుడు మరియు బుధుడి కలయిక మేషరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కెరీర్ లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారస్తులు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండండి.
Also Read: Surya Dev: కన్యా సంక్రాంతి రోజు ఇలా చేస్తే... మీకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook