These Four zodiac sign peoples should be careful at Solar Eclipse 2022: ఈ ఏడాది అక్టోబర్ 25న సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీపావళి రెండవ రోజున ఈ సూర్యగ్రహణం ఏర్పడనుంది.1995లో దీపావళి రోజున సూర్యగ్రహణం ఏర్పడగా.. మళ్లీ 27 ఏళ్ల తర్వాత దీపావళి రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది. 2022 సంవత్సరంలో రెండో, చివరి సూర్యగ్రహణం ఇదే. ఈ సూర్యగ్రహణం దాదాపు భారతదేశం అంతటా కనిపిస్తుంది. అయితే సూర్యగ్రహణం రోజున 4 గ్రహాలు కలవనున్నాయి. దాంతో అన్ని రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు, సూర్యుడు, శుక్రుడు మరియు కేతువు గ్రహాలు తులా రాశిలో కలిసి ఉంటాయి. ఇది అన్ని రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది. అయితే సూర్యగ్రహణం సమయంలో ఈ 4 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి. ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం ఓసారి తెలుసుకుందాం.


మేషం: 
మేష రాశి వారు సూర్యగ్రహణం సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీ భాగస్వామి శారీరక సమస్యలను ఎదుర్కొంటారు. కొన్ని కారణాల మీ భాగస్వామికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఇద్దరి మధ్య సఖ్యత కూడా ఉండదు. డబ్బు విషయంలో భార్య భర్తల మధ్య గొడవలు రావొచ్చు. పెట్టుబడులు పెట్టాలనుకునేవారు వాయిదా వేసుకోవడం మంచిది.


మిథునం:
సూర్యగ్రహణం కారణంగా మిధున రాశి వారి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సేవింగ్స్ నుంచి కూడా డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే సూర్యగ్రహణం సమయంలో ఆర్థిక విషయాలలో చాలా ఓపికగా, తెలివిగా వ్యవహరించాలి. ఈ సమయంలో మీరు చేసే పని ఆలస్యం కావచ్చు. సరిగ్గా ప్లాన్ చేస్తేనే పని పూర్తవుతుంది.


తులా:
సూర్యగ్రహణ ప్రభావం తులా రాశి వారిపై ఎక్కువ ప్రభావం చూపనుంది. ఈ సమయంలో మీరు ప్రమాదానికి గురైయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాహనాన్ని ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ జాగ్రతే మిమ్మల్ని ప్రమాదం నుంచి బయటపడేస్తుంది. 


మకరం:
సూర్యగ్రహణం కారణంగా మకర రాశి వారికి శారీరక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి సూర్యగ్రహణానికి ముందు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. శారీరక నొప్పి అకస్మాత్తుగా సంభవించవచ్చు. ఆహారం నియమావళిని అనుసరిస్తే మంచిది. వృత్తి మరియు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో వాగ్వాదం చేయొద్దు. అహాన్ని అదుపులో ఉంచుకోవాలి. 


Also Read: Junaid Siddique Six: బాప్‌రే.. ప్రపంచకప్‌లోనే భారీ సిక్సర్‌! వైరల్ అయిన యూఏఈ ప్లేయర్ సెలెబ్రేషన్స్


Also Read: Mangal Vakri 2022: కుజుడు మిథునంలోకి సంచారం..ఈ రాశుల వారి ఇల్లు డబ్బుతో నిండిపోతాయి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook