Mangal Vakri 2022: కుజుడు మిథునంలోకి సంచారం..ఈ రాశుల వారి ఇల్లు డబ్బుతో నిండిపోతాయి!

Mangal Vakri 2022: కుజుడు 30 అక్టోబర్ 2022న వేరే రాశిలోకి తిరోగమనం చెందబోతున్నాడు. అంగారకుడి తిరోగమనం వల్ల నాలుగు రాశులవారికి మహాపురుష రాజయోగం రాబోతుంది. వీరు ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన మంచి ఫలితాలు పొందుతారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 19, 2022, 08:20 AM IST
  • కుజుడు ఇతర రాశిలోకి సంచారం..
  • ఈ రాశుల వారి ఇల్లు డబ్బుతో నిండిపోతాయి
  • వ్యాపారాల్లోత తప్పకుండా విజయాలు సాధిస్తారు.
Mangal Vakri 2022: కుజుడు మిథునంలోకి సంచారం..ఈ రాశుల వారి ఇల్లు డబ్బుతో నిండిపోతాయి!

Mangal Vakri 2022: జ్యోతిష్య శాస్త్రంలో అంగారకుడు గ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు. అంగారక గ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే అంగారకుడే కాకుండా కుజ గ్రహానికి కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కుజుడు అనుకూలంగా ఉంటేనే వ్యక్తి జీవితంలో ధైర్యం, వివాహాలు, ఇతర పనులను సులభంగా కొనసాగుతాయి. లేకపోతే జీవితంలో చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈనెల అక్టోబర్ 30న కుజుడు ఇతర రాశుల్లోకి సంచరించబోతున్నాడు. ఈ సంచారం వల్ల పలు రాసిన వారికి శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. కాబట్టి ఈ ప్రభావం ఏ రాశులపై పడుతుందో.. వారు ఈ క్రమంలో పలు మంచి పనులు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వ్యాపారాల్లో ఉద్యోగాల్లో మంచి విజయాలు సాధిస్తారని శాస్త్రం సూచిస్తోంది. ఈ క్రమంలో ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..

వృషభం:
కుజుడు తిరోగమనం కారణంగా వృషభ రాశి వారికి రాజయోగ గడియలు రాబోతున్నాయి. వీరు ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన విజయాలు తప్పకుండా సాధిస్తారు అంతేకాకుండా సమాజంలో వీరికి మంచి గౌరవం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారు రాజకీయాల్లో ఎదగాలంటే ఇదే సరైన సమయం గా భావించవచ్చు. ఈ సంచారం వల్ల రాజకీయాల్లో మంచి పదవులు పొందే అవకాశాలున్నాయి.

సింహరాశి:
తిరోగమన కారణంగా సింహ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుందని చెప్పవచ్చు. కుజుడు సంచారం వల్ల ఆగిపోయిన పనులన్నీ వేగంగా జరగడమే కాకుండా మంచి ఫలితాలు కూడా పొందుతారని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కెరీర్ లో మంచి ప్రశంసలు లభించడమే కాకుండా గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు తప్పకుండా ఈ క్రమంలో ఉద్యోగాలు సాధిస్తారు. వారిపై వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారు.

కన్యారాశి:
సంచారం వల్ల ఈ రాశి వారికి రాజయోగ గడియలు రాబోతున్నాయి. వ్యాపారాలలో ఆశించిన విజయాన్ని దిశగా అడుగులు వేస్తారు. అంతేకాకుండా విద్యా రంగానికి సంబంధించిన వారు మంచి ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు. కాబట్టి ఈ క్రమంలో వీరు తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

కుంభ:
కుజుడు తిరోగమనం వల్ల కుంభ రాశి వారికి మంచి ప్రయోజనాలు లభించే అవకాశాలున్నాయి. వీరు చేసే ప్రతి పనిలో విజయం పొందుతారు. వ్యాపార రంగాల్లో మంచి ప్రయోజనాలు పొందుతారు. అయితే ఈ క్రమంలో చట్టవిరుద్ధమైన పనులు అస్సలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

 

Also Read : Nirupam Paritala - Premi Viswanath : కార్తీకదీపం సెట్లో వంటలక్క చేసే పనులివేనా?.. డెడికేషన్ అంటే డాక్టర్ బాబుదే

Also Read : Chinmayi Sripada Twin Babies : పిల్లలకి పాలు పడుతున్న చిన్మయి.. ఆనందంలో తేలిపోతోన్న సింగర్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

 

Trending News