Surya Gochar 2022: నవరాత్రుల తర్వాత తుల రాశిలోకి సూర్యభగవానుడు.. ఈ రాశులవారికి లక్కే లక్కు..!
Surya Gochar 2022: నవరాత్రుల తర్వాత గ్రహాల రాజు సూర్యుడు రాశిని మార్చనున్నాడు. దీని ప్రభావం వల్ల కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
Surya Rashi Parivatan 2022: సూర్యభగవానుడు ప్రతినెలా తన రాశిని మారుస్తాడు. దీని ప్రభావం మెుత్తం 12 రాశులవారి పై ఉంటుంది. ప్రస్తుతం సూర్యభగవానుడు కన్యారాశిలో ఉన్నాడు. అక్టోబరు నెలలో అంటే నవరాత్రి తర్వాత సూర్యభగవానుడు కన్యారాశిని విడిచిపెట్టి అక్టోబర్ 17 రాత్రి 07:09 గంటలకు తులరాశిలోకి (Sun Transit in leo 2022) ప్రవేశిస్తాడు. దీనినే తుల సంక్రాంతి అంటారు. సూర్యుడి రాశి మార్పు వల్ల ఏ రాశులవారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.
1. వృషభం (Taurus)- సూర్యుడు తులారాశిలో ప్రవేశించడం వల్ల వృషభ రాశి వారికి ప్రయోజనం కలుగుతుంది. వీరు తమ అదృష్టంతో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగుల పురోగతికి అవకాశం ఉంది.
2. సింహ రాశి (Leo)- ఈ రాశి వారు తమ వృత్తిలో లాభపడతారు. అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. అయితే కొన్ని రాశుల వారు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది.
3. ధనుస్సు (Sagittarius)- సూర్య రాశి మార్పు ధనుస్సు రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ కెరీర్‌లో శుభవార్తలను అందుకుంటారు. పురోగతికి అవకాశాలు ఉన్నాయి. జీతం పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు.
4. మకర రాశి (Capricorn)- మకర రాశి వారికి పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీకు ఆఫీసులో ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జించే అవకాశం ఉంది.
5. మీన రాశి (Pisces)- మీన రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పురోగతికి అవకాశాలుంటాయి.
Also Read: Dhanteras 2022: ధంతేరాస్ రోజు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి, లేకపోతే మీకే నష్టం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook