Sun Gochar In Mesh 2023: జ్యోతిషశాస్త్రంలో ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. దీని ప్రభావం ప్రజలందరిపై కనిపిస్తుంది. కొత్త ఏడాదిలో సూర్యుడు మేషరాశిలో (Surya Gochar 2023) సంచరించనున్నాడు. ఏ గ్రహం ఉచ్ఛమైన రాశిలో ఉంటే అది పూర్తి ఫలితాలను ఇస్తుంది. దీని ప్రభావం ప్రజలందరిపై కనిపిస్తుంది. మేషరాశిలో సూర్య సంచారం మూడు రాశులవారికి మేలు చేస్తుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మకర రాశిచక్రం (Capricorn): మేషరాశిలో సూర్యదేవుని సంచారం మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యభగవానుడు మీ రాశి నుండి నాల్గవ ఇంట్లోకి సంచరించబోతున్నాడు. దీంతో ఈ రాశివారు సకల సుఖాలను పొందుతారు. మీరు ఇంట్లోకి ఏదైనా విలాసవంతమైన వస్తువును కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. కుటుంబ సంబంధాలు బాగుంటాయి. మీ ఫ్యామిలీ సపోర్టుతో మీరు ప్రతి సమస్యను అధిగమిస్తారు. 


కర్కాటక రాశిచక్రం (Cancer): సూర్యభగవానుడి రాశి మార్పు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే  సూర్యదేవుడు మీ రాశిచక్రం నుండి పదవ ఇంట్లోకి సంచరించబోతున్నాడు. దీంతో మీరు ఈ సమయంలో మంచి ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈ సమయం కలిసి వస్తుంది. మీ బిజినెస్ విస్తరిస్తుంది. మరోవైపు పుడ్ కు సంబంధించిన వ్యాపారం చేసే వ్యక్తులు భారీగా లాభపడతారు. 


సింహ రాశి (Leo): సూర్యుని రాశి మార్పు సింహరాశి వారికి ఆర్థికంగా మేలు చేస్తుంది. ఎందుకంటే సూర్యదేవుడు మీ జాతకంలో తొమ్మిదో ఇంట్లో సంచరించనున్నాడు. దీంతో మీ అదృష్టం ప్రకాశిస్తుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీరు వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీరు రూబీ రాయిని ధరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 


Also Read: Budhaditya Rajyog: మకరంలో బుధాదిత్య రాజయోగం.. 2023లో ఈ 3 రాశులకు అదృష్టం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook