Surya Gochar 2023: గ్రహాలన్నీ కొంత కాలం తర్వాత తమ రాశిని మార్చుకుంటాయి. ఇందులో సూర్యుడి రాశి మార్పు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే హిందూ మతంలో సూర్య సంచారాన్ని 'సంక్రాంతి' అని పిలుస్తారు. మరో మూడు రోజుల్లో అంటే జూలై 17, 2023 తెల్లవారుజామున 05.19 గంటలకు సూర్యుడు మిథునరాశి నుండి బయటకు వెళ్లి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడి రాశి మార్పు కొందరికి శుభప్రదంగా, మరికొందరికి అశుభకరంగా ఉంటుంది. ఆదిత్యుడి సంచారం వల్ల కొన్ని రాశులవారు సమస్యలను ఎదుర్కోనున్నారు. అ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం
సూర్యుని సంచార సమయంలో వృషభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. మీ మాటలను అదుపులో ఉంచుకోండి, లేకపోతే మీకే నష్టం. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు బాగా ఆలోచించండి. మీ కుటుంబంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎంత కష్టపడినప్పటికి అనుకూల ఫలితాలు సాధించలేరు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి సూర్య సంచారం అశుభం. జాబ్ చేంజ్ అవ్వడానికి ఇదే మంచి సమయం కాదు. కుటుంబంలో గొడవలు వస్తాయి. మీ పని ప్రదేశంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి రావచ్చు. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. 
మకరరాశి
సూర్యుడి రాశి మార్పు మకరరాశి వారికి కలిసిరాదు. వ్యాపారంలో భారీగా నష్టాలు ఉంటాయి. ఈ సమయంలో వీలైనంత వరకు ఇతరులతో వాదనలకు దిగకండి. మీ వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఈ సమయం మీకు అస్సలు కలిసిరాదు.


Also Read: Venus retrograde 2023: జూలై 23న కీలక పరిణామం.. ఈ 5 రాశులవారికి గుడ్ టైమ్ స్టార్ట్...



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook