Budh Surya Yuti 2023: వృషభరాశిలో సూర్యుడు- బుధుడు కలయిక.. ఏర్పడిన బుధాదిత్య రాజయోగం.. ఈ రాశులకు మహార్దశ
Sun Mercury Conjunction in Vrishabha Rashi on 07th June 2023: మరో 5 రోజుల్లో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. దీనిని చాలా పవిత్రమైన యోగంగా భావిస్తారు. బుధాదిత్య రాజయోగం వల్ల మూడు రాశులవారు ఊహించని ప్రయోజనాలు పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Sun Mercury Conjunction in Vrishabha Rashi on 07th June 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రస్తుతం సూర్యభగవానుడు వృషభరాశిలో సంచరిస్తున్నాడు. జూన్ 07న ఇదే రాశిలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు. వృషభరాశిలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అయతే ఈ యోగం కేవలం ఏడు రోజులు మాత్రమే ఉండనుంది. బుధాదిత్య రాజయోగం మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఈ యోగం మూడు రాశులవారికి అపారమైన ప్రయోజనాలను ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
బుధాదిత్య రాజయోగం ఈరాశులకు వరం
వృషభం: ఇదే రాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఇది వృషభ రాశి వారికి చాలా మేలు చేస్తుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు కెరీర్ లో మంచి స్థాయికి వెళతారు. వ్యాపారం బాగా సాగుతుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది.
సింహ రాశి: బుధాదిత్య రాజయోగం ఈ రాశి వారికి కలిసి వస్తుంది. సింహరాశి వారు ఉద్యోగ, వ్యాపారాల్లో చాలా లాభాలను పొందుతారు. మీకు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. పాలిటిక్స్ లో ఉన్నవారు మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.
కర్కాటకం: కర్కాటక రాశి వారికి బుధాదిత్య యోగం చాలా లాభాలను ఇస్తుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. పెట్టుబడి ద్వారా ప్రయోజనం పొందుతారు. ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.
Also Read: Rahu Gochar 2023: వచ్చే 153 రోజులపాటు ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook