Sun Mercury transit 2023: హిందూ పంచాగం ప్రకారం మార్చ్ 16న బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. సూర్యుడి మీనరాశి ప్రవేశంతో ఈ మూడు రాశుల జాతకులకు మంచి రోజులు రానున్నాయి. అపారమైన కనకవర్షం కురవనుంది. పూర్తి వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యం ప్రకారం సూర్య, బుధ గ్రహాల యుతితో ఏర్పడనున్న బుధాదిత్య రాజయోగాన్ని అత్యంత శుభసూచకంగా భావిస్తారు. సూర్యుడు ప్రతి నెలా గోచారం చేస్తుంటాడు. ఈ నెల సూర్యుడి మార్చ్ 16వ తేదీన మీనరాశిలో ప్రవేశించనున్నాడు. అటు బుధుడు కూడా అదే రాశిలో ప్రవేశించనున్నాడు. అంటే మీనరాశిలో సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య యోగం ఏర్పడనుంది. దీని ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుంది. ముఖ్యంగా 3 రాశులకు అత్యంత శుభప్రదం కానుంది. ఈ రాశులవారికి గోల్డెన్ డేస్ ప్రారంభమైనట్టే.


బుధాదిత్య రాజయోగం ప్రభావం


వృశ్చికరాశి జాతకులకు మీనరాశిలో సూర్యుడి ప్రవేశం , బుధాదిత్య యోగంతో అద్భుతమైన ప్రయోజనం కలగనుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ప్రేమ వివాహం జరగవచ్చు. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. విజయాలు సాధించవచ్చు. జీవితం ఆనందంగా ఉంటుంది. ఆర్ధిక ఇబ్బందులుండవు.


మీనరాశి జాతకులకు సూర్య, బుధ గ్రహాల యుతితో రాజయోగం కన్పిస్తుంది. అంతులేని ధనవర్షం కురుస్తుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. అందులో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో మంచి సంబంధాలుంటాయి. ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి.


ధనస్సు రాశి వారికి బుధాదిత్య రాజయోగం ప్రభావంతో ఊహించని లాభాలుంటాయి. జీవితంలో అన్ని సంతోషాలు ప్రాప్తిస్తాయి. వాహనాలు, ఆస్థులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో అద్భుత లాభాలుంటాయి. కొత్త ఉద్యోగం లభించే అవకాశముంటుంది. తల్లిదండ్రులతో సంబంధాలు బాగుంటాయి.


Also read: Mars Transit 2023: మంగళ గ్రహం గోచారంతో కొన్ని గంటల్లో మారిపోనున్న ఈ రాశుల జీవితాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook