Sun-Mercury Transit 2023: హిందూ పంచాంగం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత రాశిలో ప్రవేశించినట్టే మే 15వ తేదీన సూర్యుడు వృషభ రాశిలో ప్రవేశించనున్నాడు. ఆ తరువాత బుధ గ్రహం సైతం అదే వృషభ రాశిలో ప్రవేశించనుండటంతో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం ప్రభావం 3 రాశులపై కీలకం కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యం ప్రకారం సూర్యుడి గోచారం మే 15న ఉంటుంది. జూన్ 7 వతేదీన బుధ గ్రహ గోచారముంది. ఈ రెండు గ్రహాలు ఒకే రాశి వృషభ రాశిలో కొద్దికాలం ఉంటాయి. ఈ రెండింటి కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. సూర్య, బుధ గ్రహాల కలయిక వల్ల ఏర్పడనున్న ఈ యోగం ప్రభావం 3 రాశుల జాతకులకు అత్యంత శుభప్రదంగా ఉండనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..


జూన్ 7న వృషభ రాశిలో సూర్య, బుధ గ్రహాలు కలిసి ఏర్పరిచే బుధాదిత్య రాజయోగంతో కుంభరాశికి అత్యంత ప్రయోజనం కలగనుంది. ఈ జాతకులకు ఆస్థి ద్వారా లాభం కలగనుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. చేపట్టిన పనిలో విజయం తధ్యం. అన్నీ అనుకూలిస్తాయి, ఆస్థులతో ఆదాయం సమకూరి లాభం కలుగుతుంది. కెరీర్‌పరంగా చాలా అనువైన సమయం. ఆరోగ్యం విషయంలో కాస్త అప్రమత్తంగా ఉంటే ఇక తిరుగే ఉండదు.


సూర్య, బుధ గ్రహాలు కలిసి జూన్ 7న ఏర్పర్చనున్న బుధాదిత్య రాజయోగం ప్రభావం మీన రాశి జాతకులకు లాభాల్ని కలగజేయనుంది. రెండు గ్రహాలు అత్యంత శక్తివంతమైనవి కావడంతో ఈ రెంటి కలయికకు చాలా మహత్యముంది. ఉద్యోగులకు కొత్త ఉద్యగావకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో పదోన్నతి లభిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. పదవితో పాటు కీర్తి కూడా మీ సొంతమౌతుంది. ఈ రాశివారికి అదృష్టంగా అన్నివేళలా తోడుగా ఉంటుంది. ఆరోగ్యంపై కాస్త ప్రత్యేక శ్రద్ధ అవసరం. 


బుధాదిత్య రాజయోగం ప్రభావం కన్యా రాశిపై లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశివారికి యోగం ప్రభావంతో అంతా అనుకూలిస్తుంది. ఆర్ధికంగా ఏ విధమైన సమస్యలుండవు. ఆరోగ్యం సైతం బాగుంటుంది. వ్యాపారులైతే లాభాలు ఆర్జించే సమయమిది. కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. పనిచేసే చోట గౌరవం లభించడమే కాకుండా పదోన్నతి, ఇంక్రిమెంట్లు వస్తాయి.


Also read: Shukra gochar 2023: ఈ నెల చివరిలో కర్కాటక రాశిలోకి శుక్రుడు.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook