Trigrahi Yog In Kumbh 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మార్చడం ద్వారా శుభ యోగాలను సృష్టిస్తాయి. ఫిబ్రవరి 27న మెర్క్యూరీ గ్రహం కుంభరాశిలోకి ప్రవేశించబోతుంది. ఇప్పటికే శనిదేవుడు, సూర్యభగవానుడు కుంభరాశిలో కూర్చుని ఉన్నారు. ఒకే రాశిలో ఈ మూడు గ్రహాల కలయిక వల్ల అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. 30 ఏళ్ల తర్వాత ఇలాంటి అరుదైన యాదృచ్చికం ఏర్పడుతుంది. ఈ త్రిగ్రాహి యోగం మూడు రాశులవారికి మేలు చేస్తుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

త్రిగ్రాహి యోగం ఈ రాశులకు శుభప్రదం
వృషభ రాశి
త్రిగ్రాహి యోగం కారణంగా వృషభ రాశి వారికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు జాబ్ ఆఫర్ వస్తుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ లేదా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీకు ఆఫీసులో సహచరుల మద్దతు లభిస్తుంది. వ్యాపారవేత్తలు మంచి లాభాలను గడిస్తారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. 
మకరం
కుంభరాశిలో ఏర్పడిన త్రిగ్రాహి యోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో రెండవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీంతో మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఆఫీసులో సహోద్యోగుల సపోర్టు లభిస్తుంది. 
మేషం
మేష రాశి వారికి త్రిగ్రాహి యోగం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి 11వ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీంతో మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. జీతంలో పెరుగుదల ఉంటుంది. వ్యాపారులకు ఈ సమయం బాగుంటుంది. బిజినెస్ చేసేవారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. మీరు స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టడం వల్ల మీరు మంచి లాభాలను గడిస్తారు. 


Also Read: Rajyogam: 30 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగం.. ఈ 3 రాశులకు ఊహించనంత ధనం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.