Sun Transit 2023: సూర్య శని గ్రహాల యుతి సమాప్తం, ఈ మూడు రాశులకు ఊహించని ధనలాభం, కొత్త ఉద్యోగాలు
Sun Transit 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల రాజు సూర్యుడు ప్రతి నెలా నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం చెందుతుంటాడు. ఆ ప్రభావం అన్ని రాశులపై పడినా..కొన్ని రాశులకు అదృష్టంగా మారుతుంది. మరి కొన్ని రాశులకు హాని కల్గిస్తుంది.
Sun Transit 2023: హిందూ పంచాంగం ప్రకారం ఇవాళ్టి నుంచి అంటే మార్చ్ 15 నుంచి శని, సూర్య గ్రహాల యుతి తొలగిపోతుంది. ఈ రాశులవారికి అదృష్టం తెర్చుకుంటుంది. అపార ధనలాభం కలుగుతుంది. ఏయే రాశులవారికి అద్భుతంగా ఉంటుందనే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇవాళ మార్చ్ 15వ తేదీన సూర్యుడు మీన రాశిలో ప్రవేశించాడు. మీన రాశిలో సూర్యుడి గోచారంతో కుంభ రాశిలో శని సూర్య గ్రహాల యుతి ముగిసిపోయింది. ఇవాళ్టి నుంచి సూర్యుడు మీనరాశిలో ఉంటాడు. గత నెలరోజులుగా సూర్య, శని గ్రహాలు కుంభరాశిలో ఉండి యుతి ఏర్పరిచాయి. శని మూల రాశిలో సూర్య, శని యుతి కొన్ని రాశులవారికి ఇప్పటివరకూ ప్రతిబంధకంగా మారింది. అభివృద్ధి జరగకుండా అడ్డుపడింది. ఇప్పుటు సూర్యుడి కుంభం నుంచి బయచికొచ్చి మీన రాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి మార్గాలు తెర్చుకున్నాయి. అదృష్టం వెంట ఉంటుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావం అదృష్టంగా మారుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభించడం, ఇంక్రిమెంట్ ఇలా వివిధ రకాలుగా లాభాలుంటాయి. ఆర్ధిక కష్టాలు దూరమౌతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆథ్యాత్మిక యాత్రలకు వెళ్లవచ్చు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు ఉంటే దూరమౌతాయి ఆర్ధికంగా ఇబ్బంది ఉండదు. విద్యార్ధులకు అనువైన సమయంగా పరిగణిస్తున్నారు.
మకర రాశి
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మకర రాశి జాతకులకు సూర్యుడి గోచారం కారణంగా అద్భుత ప్రయోజనాలు చేకూరనున్నాయి. ముఖ్యంగా సూర్య, శని గ్రహాల యుతి తొలగిపోవడం శుభసూచకం. అపారమైన ధనలాభం కలిగే అవకాశాలుంటాయి. కుటుంబంలో విభేదాలు, గొడవలు పరిసమాప్తమౌతాయి. ఏదైనా కీలకమైన శుభవార్త వింటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు అనుకూలంగా ఉంటుంది.
వృషభ రాశి
జ్యోతిష్యం ప్రకారం సూర్యుడి గోచారం వృషభ రాశి జాతకులకు ఓ వరమని చెప్పవచ్చు. ఈ రాశి జాతకుల జీవితంలో గోల్డెన్ డేస్ ప్రారంభమైనట్టే. కెరీర్‌పరంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. పదోన్నతి లభించడంతో పాటు జీతం పెరుగుతుంది. దీర్ఘకాలంగా కెరీర్ గ్రోత్ విషయంలో ఉన్న కోర్కెలు నెరవేరుతాయి. కొత్త ఉద్యోగాలు లభించవచ్చు. వ్యాపారానికి అనువైన సమయం. ఆరోగ్యపరంగా ఏ సమస్యలు తలెత్తవు. ఆర్ధిక ఇబ్బందులు పూర్తిగా దూరమౌతాయి. విద్యార్ధులకు అనువైన సమయం. కష్టానికి తగ్గ ఫలితముంటుంది.
Also read: Lucky Zodiac Signs: ఆ గ్రహాల గోచారం ప్రభావం, నెల రోజుల వరకూ వద్దంటే డబ్బు, పదోన్నతి, వ్యాపార వృద్ధి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook