Sun Transit 2023: ఈ రాశులవారిపై సూర్యగ్రహం ఎఫెక్ట్..ఈ సమయాల్లో ఏం చేసిన లాభాలతో పాటు నష్టాలు తప్పవు!
Sun Transit 2023: సూర్యగ్రహం సంచారం కారణంగా కొన్ని రాశులవారికి లాభాలతో పాటు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో తీవ్ర అనారోగ్య సమస్యలు రావచ్చు.
Sun Transit 2023: ప్రతి నెల సూర్య గ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంది. ఈ గ్రహం ఏ రాశిలోనైనా దాదాపు 30 రోజుల పాటు ఉంటుంది. ఆ తర్వాత ఇతర రాశిలోకి సంచారం చేస్తుంది. అయితే సూర్యగ్రహం అతి త్వరలోనే రాశి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. డిసెంబర్ 16న సూర్యగ్రహం ధనుస్సు రాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ సంచారం కొన్ని రాశులవారికి శుభంగా ఉంటే మరికొన్ని రాశులవారికి అశుభంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. డిసెంబర్ 16 నుంచి ఏయే రాశులవారికి సూర్యుడి సంచారంతో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం:
వృషభ రాశి:
సూర్య గ్రహం సంచారం కారణంగా వృషభ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారికి 8వ స్థానంలో సంచారం జరబోతోంది. దీని కారణంగా ఆస్తి లేదా షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశివారికి సూర్యుడి సంచారం చాలా లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశివారికి సూర్యుడు 7వ స్థానంలో సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా వీరికి లాభాలతో పాటు చిన్న చిన్న నష్టాలు కూడా వస్తాయి. ఈ సంచారం కారణంగా వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. అంతేకాకుండా మీ భాగస్వామితో గొడవలయ్యే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి సూర్యుని సంచారం మిశ్రమ ఫలితాలను అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రాశివారికి సూర్యుడి సంచారం 6వ స్థానంలో జరబోతోంది. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా మంచిది. దీంతో పాటు ఖర్చులు కూడా రెట్టింపు అవుతాయి. కాబట్టి తప్పకుండా ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి