Surya Gochar 2023: వృషభరాశిలో సూర్య సంచారం.. ఈ 4 రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..
Aditya Gochar 2023: సూర్యుడి రాశి మార్పునే మనం సంక్రాంతి అంటారు. ప్రస్తుతం ఆదిత్యుడు వృషభరాశిలో సంచరిస్తున్నాడు. సూర్యభగవానుడి యెుక్క ఈ రాశి మార్పు ఏయే రాశులవారికి లాభాలను ఇస్తుందో ఓ లుక్కేద్దాం.
Surya transit In Taurus 2023: సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనినే మనం సంక్రాంతి అంటాం. రెండు రోజుల కిందట అంటే మే 15న సూర్యభగవానుడు మేషరాశిని విడిచిపెట్టి వృషభరాశిలోకి ప్రవేశించాడు. జూన్ 14 వరకు అతడు అదే రాశిలో ఉంటాడు. వృషభరాశిలో సూర్యుడి గోచారం వల్ల కొన్ని రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
వృషభరాశిలో సూర్యుని సంచారం కర్కాటక రాశి వారికి మేలు చేస్తుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీరు ఏదైనా వాహనం లేదా కారును కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది.
సింహరాశి
మీ రాశి యెుక్క పదో ఇంట్లో సూర్యభగవానుడు సంచరించనున్నాడు. దీంతో మీరు అనుకూల ఫలితాలను పొందుతారు. మీకు ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు కెరీర్ లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీరు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మీ ఆర్థికంగా బలపడతారు.
Also Read: Gajkesari Yoga 2023: నేటి నుండి ఈ 3 రాశుల సుడి తిరగనుంది.. ఇందులో మీ రాశి ఉందా?
ధనుస్సు రాశి
సూర్య సంచారం ధనస్సు రాశి వారికి మేలు చేస్తుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీ కోర్టు కేసుల నుండి బయటపడతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు.
మీనరాశి
సూర్యుడి సంచారం మీనరాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది.
Also Read: June Planet Transit 2023: జూన్ నెల ఈ 5 రాశులకు చాలా ప్రత్యేకం.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook