Surya Gochar 2023: మీనరాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ఏర్పడిన `మీన సంక్రాంతి`.. ఈ 3 రాశులకు కష్టాలు మెుదలు
Surya Gochar 2023: ఇటీవల సూర్యభగవానుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. అయితే సూర్యుడి సంచార సమయంలో 3 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Surya Rashi Parivartan 2023: ఆస్ట్రాలజీలో సూర్యభగవానుడిని గ్రహాల రాజుగా భావిస్తారు. సూర్యుడి రాశిలో మార్పునే మనం సంక్రాంతి అంటాం. నిన్న సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. దీనినే మీన సంక్రాంతి అంటారు. సూర్యుడి రాశి మార్పు సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడి సంచారం వల్ల ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
మేష రాశిచక్రం
సూర్య భగవానుడి రాశి మార్పు మేష రాశి వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది. ఎందుకంటే సూర్యుడు మీ రాశి నుండి 12వ ఇంట్లో సంచరిస్తున్నారు. దీంతో మీ ఖర్చులు పెరుగుతాయి. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. దాంపత్య జీవితంలో విభేదాలు వస్తాయి. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
కన్య రాశిచక్రం
సూర్యుడి రాశి మార్పు వల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఎందుకంటే సూర్యభగవానుడు మీ రాశి నుండి ఏడవ ఇంట్లోకి సంచరించాడు. ఈ సమయంలో మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. ఆఫీసులో మీ సహచర ఉద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో అస్సలు పెట్టుబడి పెట్టవద్దు. ఫ్యామిలీతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది.
మకర రాశిచక్రం
సూర్యుని రాశి మార్పు మకర రాశి వారికి అననుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంచారం మీ రాశి నుండి మూడవ ఇంట్లో జరిగింది. దీంతో మీ తోబట్టువులతో విభేదాలు తలెత్తుతాయి. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవల్సి ఉంటుంది. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండండి. మీ ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకోండి. వ్యాపారంలో మీరు కుదుర్చుకున్న డీల్స్ ఆగిపోయే అవకాశం ఉంది.
Also Read: Gajkesari Rajyog: గురు చంద్రుల గజకేసరి రాజయోగం.. ఉగాది నుండి ఈ రాశులకు అంతులేని ధనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook