Surya Gochar In Kark 2023: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తోంది. సూర్యుడు నెలకొకసారి ఒక రాశి నుండి మరొక రాశికి ట్రావెల్ చేస్తాడు. జూలై 16న భాస్కరుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఈరాశికి అధిపతిగా చంద్రుడిని భావిస్తారు. అగ్నిమూలక గ్రహమైన సూర్యుడు నీటి మూలకం రాశిచక్రంలోకి వెళ్లడం నాలుగు రాశులవారికి ఇబ్బందులను కలిగించనుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మకరరాశి 
సూర్యుని సంచారం మకరరాశి వారి జీవితంలో అనేక సమస్యలను సృష్టిస్తుంది. మీ దాంపత్య జీవితంలో గొడవలు వస్తాయి. అత్తమామలతో విభేదాలు రావచ్చు.  కోర్టు కేసులకు సంబంధించిన వివాదాలా పరిష్కారమవుతాయి. మీరు ఆరోగ్య, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.
కుంభ రాశి
కుంభ రాశివారికి సూర్య సంచారం ఒక వరం. పోటీపరీక్షల్లో విజయం సాధించడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీ లవ్ లో గొడవలు వస్తాయి. మీకు పిల్లల కోసం మరింత కాలం వేచిచూడాల్సి వస్తుంది. వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది. 


Also Read: Guru vakri 2023: గురు వక్రీతో ఈ 3 రాశుల బతుకులు మారబోతున్నాయి.. మీ రాశి ఉందా?


మిధునరాశి
సూర్య సంచార సమయంలో మిథునరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కంటికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోంటారు. పూర్వీకుల ఆస్తి లేదా ల్యాండ్ కు సంబంధించిన విషయాలు బయట పరిష్కరించుకోవడం మంచిది.  ఆఫీసులో మీకు శత్రువులు పెరుగుతారు. ఈ సమయం మీకు అస్సలు కలిసిరాదు. ఈ సమయంలో మెుండితనాన్ని వీడండి.
ధనుస్సు రాశి
సూర్య సంచార ప్రభావం ధనస్సు రాశివారిపై కనిపిస్తుంది. మీ ల్యాండ్ వివాదాలు పరిష్కారమవుతాయి. సమాజంలో మీ గౌరవం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో చాలా కేర్ తీసుకోండి. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆఫీసులో మీరు మీ శత్రువుల కుట్రకు బలవుతారు. 


Also Read: Budh Uday 2023: కర్కాటక రాశిలో ఉదయించిన బుధుడు.. ఈ 3 రాశులపై నోట్ల వర్షం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook