Surya gochar in July 2023: జ్యోతిష్యశాస్త్రంలో సూర్యుడిని అత్యంత శక్తివంతుడిగా పేర్కొంటారు. సూర్యభగవానుడు అత్మ, తండ్రి, గౌరవం, ఉద్యోగం మరియు విజయానికి కారకుడిగా భావిస్తారు. ఇవాళ అంటే జూలై 16న ఆదిత్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇక్కడ అతను ఆగస్టు 17 మధ్యాహ్నం 13:27 వరకు ఉండనున్నాడు. కర్కాటక రాశికి అధిపతిగా చంద్రుడిని భావిస్తారు. పైగా సూర్యుడు, చంద్రుడు మిత్రులు. అంతేకాకుండా ఈ సమయంలో నాలుగు రాజయోగాలు సృష్టించబోతున్నారు. అనంతరం ఆదిత్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడి సంచారం నెల రోజులపాటు ఈ రాశులకు లాభాలను ఇవ్వనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభ రాశి
కర్కాటక రాశిలో సూర్య భగవానుడి ప్రవేశం వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ జాతకంలోని నాల్గో ఇంటికి సూర్యుడిని అధిపతిగా భావిస్తారు. అంతేకాకుండా ఆదిత్యుడు మీ రాశి నుండి మూడో ఇంట్లో సంచరిస్తున్నాడు.  అంతకాకుండా మీ కుండలిలోని దశమ స్థానంలో శష మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. మీరు వ్యాపార మరియు ఉద్యోగాల్లో ప్రయోజనం పొందుతారు. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రయాణాలు చేయడం మీకు అనుకూలిస్తుంది. 
కన్య రాశి
కన్యా రాశి వారికి సూర్యుని సంచారం శుభప్రదంగా ఉంటుంది. సూర్యుడు మీ రాశిలో పన్నెండవ ఇంటికి అధిపతి మరియు పదకొండవ ఇంట్లో సంచరిస్తున్నాడు. మీ రాశికి అధిపతి బుధుడు. అంతేకాకుండా మీ రాశి యెుక్క లాభదాయకమైన ఇంట్లో బుధాదిత్య యోగం ఏర్పడటం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు విదేశాల నుండి భారీగా ఆదాయం వస్తుంది. పెట్టుబడి, వ్యాపారం, స్పెక్యులేషన్ మొదలైన వాటి నుండి ఆకస్మిక లాభం ఉంటుంది. మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. పాలిటిక్స్ లో ఉన్నవారిక ఈ సమయం బాగుంటుంది.
వృశ్చిక రాశి
సూర్యభగవానుడి రాశి మార్పు మీకు అదృష్టాన్ని ఇస్తుంది. మీ అదృష్ట ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు సంచరిస్తున్నారు. మీరు వ్యాపార లేదా ఉద్యోగ నిమిత్తం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులకు ఈ సమయం బాగుంటుంది. 
కుంభ రాశి
సూర్యుని ఈ సంచారంతో కుంభరాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. సూర్యుడు మరియు బుధుడు మీ రాశి నుండి ఆరవ ఇంటిలో సంచరిస్తున్నారు. దీంతో మీరు అప్పుల బాధ నుండి బయటపడతారు. మీరు కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సూర్యుడు ఎల్లప్పుడూ మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు వస్తాయి. 


Also Read: Surya Gochar 2023: ఆగష్టు 17 వరకు ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు.. మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి