Sun transit 2023: మార్చ్ 16 న బుధాదిత్య రాజయోగం, ఆ మాడు రాశులకు ఇక తిరుగులేదు
Sun transit 2023: హిందూమతం జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనం, 2-3 గ్రహాల కలయికతో ఏర్పడే యుతి ప్రభావం ఇతర రాశులపై ఉంటుంది. కొన్ని రాశులపై అనుకూలంగా, కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Sun transit 2023: జ్యోతిష్యం ప్రకారం త్వరలో మీన రాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. మార్చ్ 16వ తేదీన సూర్యుడి గోచారంతో గురుడి రాశి మీనంలో ఈ యోగం ఉంటుంది. ఫలితంగా 3 రాశులపై ఊహించని ధనలాభముంటుంది. బుధాదిత్య రాజయోగం కారణంగా లాభపడనున్న ఆ మూడు రాశులేవి..
గ్రహాల గోచారం దృష్ట్యా మార్చ్ నెల అత్యంత కీలకం. మార్చ్ 12వ తేదీ ధనం, విలాసం, ప్రేమకు కారకుడిగా భావించే శుక్రుడు చేయనున్నాడు. ఇక మార్చ్ 16వ తేదీన విజయం, ఆత్మ విశ్వాసం, ఆరోగ్యానికి కారకుడిగా పిలిచే సూర్యుడు రాశి పరివర్తనం ఉంది. సూర్యుడు మీనరాశిలో ప్రవేశించనున్నాడు. ఆ రాశిలో అప్పటికే బుధుడు ఉండటంతో..మీనరాశిలో బుధ, సూర్య గ్రహాల యుతితో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం అన్నిరాశులపై పడుతుంది. ముఖ్యంగా 3 రాశులపై అద్భుతంగా ఉండనుంది. పెద్దఎత్తున ధనలాభం కలుగుతుంది. ఈ మూడు రాశుల జాతకులకు ధనలాభం, గౌరవ మర్యాదలు ప్తాప్తించనున్నాయి.
బుధాదిత్య రాజయోగంతో ఏ రాశులకు ప్రయోజనం
మిథున రాశి
ఈ రాశివారికి బుధాదిత్య రాజయోగం అత్యంత శుభసూచకం కానుంది. ఉద్యోగంలో వృద్ధి ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. ప్రత్యేకించి రాజకీయాలాల్లో ఉండేవారికి కీలకమైన పదవులు, విజయాలు లభిస్తాయి. పదోన్నతి, ఇంక్రిమెంట్లు ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కర్కాటక రాశి
బుధాదిత్య రాజయోగం కారణంగా కర్కాటక రాశి జాతకులకు గోల్డెన్ డేస్ ప్రారంభమైనట్టు చెప్పవచ్చు. ప్రతి పనిలో అదృష్టం తోడుగా నిలిచి విజయం సాధిస్తారు. పనులు పూర్తవుతాయి. విద్యార్ధులకు అత్యంత అనుకూల సమయం. ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. కోర్కెలు నెరవేరనున్నాయి. పనిచేసే చోట ప్రశంసలు లభిస్తాయి.
వృషభ రాశి
వృషభ రాశి జాతకులు బుధాదిత్య రాజయోగం ఫలితంగా ఊహించని లాభముంటుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడుల వల్ల లాభముంటుంది. బ్రహ్మచారులకు పెళ్లి యోగం ఉంటుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.
Also read: Papmochani Ekadashi 2023 : పాపమోచని ఏకాదశి వ్రతం చేస్తే ఈ పాపాల నుంచి విముక్తి.. ఎలా చేయాలో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook