Sun Transit In Scorpio 2024: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన గ్రహాల్లో సూర్య గ్రహణం ఒకటి. ఈ గ్రహాన్ని అన్ని గ్రహాలకు రాజుగా కూడా పరిగణిస్తారు అయితే సూర్యగ్రహణం రాశి సంచారం చేసిన ప్రతిసారి అన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి మంచి జరిగితే మరికొన్ని రాశుల వారికి చెడు జరుగుతుంది. ప్రతి గ్రహం ఏదో ఒక సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి ప్రవేశిస్తూ ఉంటుంది. అలాగే ఈ సూర్యగ్రహం కూడా ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేయడానికి దాదాపు 30 రోజుల పాటు సమయం పడుతుంది. ఇదిలా ఉంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహం నవంబర్‌లో వృశ్చిక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీంతో కొన్ని రాశుల వారిపై ఆర్థిక జీవితం, వ్యక్తిగత జీవితంపై ప్రత్యేకమైన ప్రభావం పడే అవకాశాలున్నాయి. అయితే వృశ్చిక రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో అత్యధిక లాభాలు పొందబోయే రాశుల వారెవరు? వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృశ్చిక రాశి 
సూర్యుడి సంచారం వృశ్చిక రాశి వారికి విశేషమైన ప్రయోజనాలను కలిగించబోతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి వ్యాపారాల్లో అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా రహస్యంగా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరబోతున్నాయి ముఖ్యంగా కుటుంబ జీవితంతో పాటు వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్న తొలగిపోతాయి. అలాగే జీవితం ఎంతో ఆనందంగా కొనసాగుతుంది. కెరీర్ కోసం ప్రణాళికలు చేసే వారికి ఈ సమయం ఎంతో కలిసి వస్తుంది. అయితే ఈ సమయంలో కాస్త వీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది వాదనలకు దూరంగా ఉంటే ఎంతో మంచిది.. రాజకీయం చేసే వ్యక్తులకు కూడా సూర్యగ్రహ సంచారం చాలా శుభప్రదం ఉండబోతోంది. 


సింహ రాశి
సింహ రాశి వారికి కూడా సూర్యుడి ప్రత్యేకమైన సంచార ప్రభావంతో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి జీవితంలో వస్తున్న సమస్యలు పూర్తిగా పరిష్కారమే కాకుండా డబ్బుపరమైన జీవితంలో విశేషాలు కలుగుతాయి. ఇక వీరికి ధైర్యం పెరిగి ఊహించని విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకైతే ఈ సమయం చాలా బాగుంటుంది అలాగే కష్టపడి చదువుకునే వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. కొన్ని ప్రత్యేకమైన రాజయోగాలు ఈ సమయంలో ఏర్పడడం కారణంగా సింహ రాశి వారికి పూర్తిగా నుదుటి రాత మారుతుంది. 


ఇదీ చదవండి:  Motorola G85 5G Discount Offer: ఇంత తగ్గింపా? ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.9,200కే Motorola G85 5G మొబైల్‌.. మరెన్నో డిస్కౌంట్‌ ఆఫర్స్‌!


మకర రాశి 
మకర రాశి వారికి వచ్చేనెల చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు కలగడమే, కాకుండా భార్యాభర్తల మధ్య వస్తున్న గొడవలు కూడా తొలగిపోతాయి. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఈ సమయంలో వ్యాపారాలు ప్రారంభించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే వైవాహిక జీవితంలో వస్తున్న ఎలాంటి  ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల విపరీతమైన లాభాలు కలుగుతాయి. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారికి జీతం ఒక్కసారిగా పెరిగే ఛాన్స్ కూడా ఉంది.


ఇదీ చదవండి:  Motorola G85 5G Discount Offer: ఇంత తగ్గింపా? ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.9,200కే Motorola G85 5G మొబైల్‌.. మరెన్నో డిస్కౌంట్‌ ఆఫర్స్‌!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.